మాస్‌రాజాకి ‘నిధి’ దొరికిందా.?

మరిన్ని వార్తలు

‘రాక్షసుడు’ సినిమాతో ఇటీవల మంచి హిట్‌ అందుకున్న డైరెక్టర్‌ రమేష్‌ వర్మ ఇప్పుడు మాస్‌ రాజా రవితేజతో ఓ మాస్‌ హిట్‌కి ప్లాన్‌ చేస్తున్నాడు. మేలో సెట్స్‌ మీదికెళ్లనున్న ఈ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారట. అందులో ఒక హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ ఎంపికయ్యిందనీ సమాచారం. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా చక్రం తిప్పే కళ ఉందని నిధిని చూసి మొదట్లో అనుకున్నారంతా. కానీ, అదృష్టం కలిసి రాలేదు. తొలి రెండు సినిమాలూ ఫ్లాప్ లిస్ట్లోకి వెళ్లిపోయాయి. మూడో సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో సూపర్‌ హిట్‌ కొట్టింది.

 

కానీ, ఆ హిట్‌ నిధి కెరీర్‌కి ఎంతమాత్రమూ కలిసి రాలేదు. ఆ తర్వాత కూడా చెప్పుకోదగ్గ ఆఫర్‌ నిధి చేతికి చిక్కలేదు. యంగ్‌ హీరో గల్లా అశోక్‌ సినిమాలో ప్రస్తుతం నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక లేటెస్ట్‌ ఆఫర్‌ ఓకే అయితేనైనా నిధికి దశ తిరుగుతుందా.? అంటే అనుమానమే. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత వెంటనే రవితేజతో జత కట్టింది తోటి హీరోయిన్‌ నభా నటేష్‌. కానీ, హిట్‌ కొట్టలేకపోయింది. మరి, నిధికైనా మాస్‌ రాజా కలిసొస్తాడా.? పోనీ మాస్‌ రాజాకి అయినా నిధి కలిసొస్తుందా.? వరుస ఫ్లాప్స్‌తో రవితేజ కూడా కొట్టుమిట్టులాడుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే, త్వరలో ‘క్రాక్‌’ సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శృతిహాసన్‌ హీరోయిన్‌గా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS