గ్లామర్‌ 'నిధి' కెవ్వుకేకహే.!

By iQlikMovies - April 11, 2018 - 11:38 AM IST

మరిన్ని వార్తలు

అందాల భామ నిధి అగర్వాల్‌ 'సవ్యసాచి' చిత్రంతో తెరంగేట్రం చేస్తోంది. ఈ బ్యూటీ తెరంగేట్రానికి ముందే హల్‌చల్‌ మొదలెట్టేసింది. గ్లామర్‌తో నెట్టింట్లో తెగ హడావిడి చేసేస్తోంది. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న 'సవ్యసాచి' చిత్రం ఇంకా నిర్మాణ దశలో ఉంది. చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సినిమా విడుదల కాకముందే, ఈ బ్యూటీ తనను తాను సోషల్‌ మీడియాలో పరిచయం చేసేసుకుంటోంది. వట్టి పరిచయమేనా, తనలోని గ్లామర్‌ యాంగిల్స్‌ని ఒక్కొక్కటి ఎగ్జిబిట్‌ చేస్తూ, ఆల్రెడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచేసుకుంటోంది. ఇప్పటికే ఈ రకంగా గ్లామర్‌ తళుకులతో పాపులర్‌ అయిన ఈ బ్యూటీ ఇక 'సవ్యసాచి'తో హిట్‌ కొట్టిందంటే ఇక వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదంతే అంటున్నారు అమ్మడి గ్లామర్‌ టాలెంట్‌ చూసి. తాజాగా నిధి అగర్వాల్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ ఫోటో చూస్తే ఆహా ఈ గ్లామర్‌ నిధిని తమ సినిమాలో బంధించి తీరాల్సిందే అనిపించేలా ఉంది. జీన్స్‌ బోటమ్‌, వైట్‌ షర్ట్‌లో హాట్‌ హాట్ట్‌గా ఎట్రాక్ట్‌ చేస్తోంది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS