అక్కినేని బుల్లోడు నాగచైతన్య నటిస్తున్న 'సవ్యసాచి' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతోన్న బ్యూటీ నిధి అగర్వాల్. సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ బాలీవుడ్‌లో 'మున్నా మైఖేల్' చిత్రంలో నటించింది ఈ క్యూట్ భామ. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ అక్కినేని హీరోలతో నటించే ఛాన్స్ దక్కించుకుంది.
'సవ్యసాచి' తర్వాత అఖిల్‌తో 'మిస్టర్ మజ్ను' చిత్రంలో నటిస్తోంది. కాగా చిన్న తనం నుండీ యాక్టింగ్ అంటే ఆశక్తి ఎక్కువ ఈ ముద్దుగుమ్మకి. ఆ ఇంట్రెస్ట్‌తోనే డాన్సుల్లో శిక్షణ తీసుకుంది. కథక్ తదితర డాన్సుల్లో మంచి ప్రావీణ్యం ఉంది నిధి అగర్వాల్‌కి. అలాగే బెల్లీ డాన్సుల్లోనూ సూపర్బ్ టాలెంట్ ఉందట నిధి అగర్వాల్‌కి. అఖిల్ సరసన 'మిస్టర్ మజ్ను'లో డాన్సులు ఇరగదీసేందుకు రెడీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ 'సవ్యసాచి' సినిమాలో స్టైలిష్ లుక్స్‌తో అదరగొట్టేస్తోంది.
ఈ సినిమా నుండి లేటెస్టుగా రిలీజైన 'వై నాట్' సాంగ్‌లో గ్లామర్‌తో పాటు స్టైలిష్ అప్పియరెన్స్‌తో ఆకట్టుకుంటోంది. చైతూ, నిధి అగర్వాల్ జంట ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా హిట్ అయితే ఆమె ఫ్రెష్ లుక్స్‌కీ, స్టైలింగ్‌కీ కుర్రకారు ఫిదా అయిపోవడం ఖాయమంతే. ఒక్కసారి క్రేజ్ సంపాదించిందా.. ఇక అంతే, ప్రస్తుతం క్రేజ్‌లో ఉన్న రష్మికా తదితర ముద్దుగుమ్మలకు గట్టి పోటీ కానుంది అందాల నిధి అగర్వాల్.
చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సవ్యసాచి' చిత్రంలో నాగ చైతన్య ఓ డిఫరెంట్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా నాగచైతన్యను మరో మెట్టు పైకి తీసుకెళ్లే సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో సినిమా రూపొందుతోంది.