అందాల నిధి అలా చూస్తేనే చాలు కుర్రకారు గుండెలకు కోత పడిపోతుంది. అలాంటిది హాట్ అప్పీల్లో కాస్త కొంటెతనం మిక్స్ చేసిందంటే, ఇంకేముంది. గాల్లో తేలినట్లుందే, గుండె జారినట్లుందే.. కొత్తగా రెక్కలొచ్చి చుక్కల్లోకి వెళ్లిపోయినట్లుందే.. అంటూ పాటేసుకోవల్సిందే పోరగాళ్లు. తాజా పిక్ చూశారా? పోలా.. అదిరిపోలా.. అన్నట్లు లేదూ. బ్లాక్ హాట్ స్లీవ్‌లెస్ మోడ్రన్ ఫ్రాక్ ధరించింది. కొంచెం సైడ్ టర్నింగ్ ఇచ్చుకో.. అని ఎవరో చెప్పినట్లుగా, సైడ్ లుక్ ఇచ్చింది. స్టైల్ సూపర్బ్ అనిపించింది.
యాక్సెసరీస్ విషయానికి వస్తే, మెడలో స్టెప్పు, స్టెప్పుల మెటల్ ఛైన్ ధరించింది. ఒక చేతికి వాచీ ధరించింది. ఇక కాలికి వేసిన ఆ హై హీల్ గమ్ బూట్స్, టోటల్ నిధి అగర్వాల్ లుక్స్‌నే ఇస్మార్ట్‌గా మార్చేశాయి. సో క్యూట్ అండ్, వెరీ హాట్‌గా నిధి అగర్వాల్ కాక పుట్టిస్తోంది. ఇటీవల 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన నిధి అగర్వాల్ తదుపరి మరో తెలుగు ప్రాజెక్టుపై సైన్ చేయలేదు. కానీ, తమిళంలో జయం రవితో ఓ సినిమాలో నటిస్తోంది.