బాలీవుడ్ మూవీ 'టూ స్టేట్స్'ని అదే టైటిల్‌తో తెలుగులోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో జీవిత - రాజశేఖర్ దంపతుల పెద్ద కుమార్తై శివాని హీరోయిన్‌గా తెరంగేట్రం చేయాల్సి ఉంది. అయితే, అనుకోకుండా, ఈ సినిమా షూటింగ్ దశలోనే ఆగిపోయింది. కథలో చిన్నపాటి లోపాలున్న కారణంగా, కొంత భాగం షూటింగ్ అయ్యాక సినిమాని నిర్మాతలు ఆపేశారు. దాంతో, కొండంత ఆశలు పెట్టుకున్న శివాని కెరీర్ చిక్కుల్లో పడిపోయింది. ఈ సినిమాలో అడవి శేష్ హీరో అన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే, ఈ మధ్య అడవి శేష్ 'ఎవరు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. తర్వాత మహేష్‌బాబు నిర్మాణంలో రూపొందబోయే 'మేజర్' సినిమా కోసం కసరత్తులు స్టార్ట్ చేశాడు. ఆ వెంటనే 'గూఢచారి 2' పట్టాలెక్కించేయనున్నాడు. ఇలా అడవి శేష్ ఫుల్ బిజీగా ఉన్నాడు. కానీ, శివాని మాత్రం మరో అవకాశం కోసం ట్రై చేస్తున్నట్లు కూడా లేదు. డెబ్యూ మూవీ అలా అయ్యేసరికి శివాని చాలా డిజప్పాయింట్ అయ్యిందట. తనకన్నా వెనక ఇండస్ట్రీని టచ్ చేసిన చెల్లెలు శివాత్మిక 'దొరసాని'తో ఆల్రెడీ డెబ్యూ చేసేసింది. కానీ, పాపం శివాని ఎంట్రీ ఎప్పుడనే విషయంపైనే ఇంకా క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే, 'టూ స్టేట్స్' నిర్మాత సినిమా ఆగిపోయినందుకు ప్రతిగా శివాత్మికతో మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చాడట. సో నిర్మాత రెడీగా ఉన్నాడు. డైరెక్టర్, కథ రెడీ అయితే, శివాని డెబ్యూకి రంగం సిద్ధమైనట్లే. తెర వెనుక ఈ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయో లేదో తెలియాలంటే రాజశేఖర్ ఫ్యామిలీ నుండి ఇన్‌ఫామేషన్ వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.