గ్లామ్‌షాట్‌: 'ఇస్మార్ట్‌' చాక్లెట్‌.. టూ హాట్‌!

మరిన్ని వార్తలు

నిధి అగర్వాల్‌లో ఆకర్షించే అందమే కాదు, అంతకు మించిన హాట్‌నెస్‌ కూడా ఉంది. ఎక్కడ కనిపించినా హాట్‌ హాట్‌ మేఘాలు ఆమె చుట్టూ వైఫైలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది అందాల నిధి. తాజాగా ఓ చాక్లెట్‌ కంపెనీ ఓపెనింగ్‌కి వెళ్లింది. అసలే చాక్లెట్‌ లాంటి అందం. ఇక చాక్లెట్‌ కంపెనీ ఓపెనింగ్‌ అంటే, చాక్లెట్‌లా ఊరించేలానే రావాలి కదా. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదులెండి. మొన్న జరిగిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌లో నిధి అగర్వాల్‌ చేసిన అందాల రచ్చ అంతా ఇంతా కాదు. అరాచకం సృష్టించేసింది. ఇప్పుడు చాక్లెట్‌ కంపెనీ ఓపెనింగ్‌ పేరు చెప్పి మరోసారి బీభత్సం చేసేసింది. ఆమెను అలా చూసేందుకు అభిమానులు క్యూలు కట్టేశారు.

 

ఒకరిపై ఒకరు పడి మైకంలో ఊగిపోయారు. ఎంత చేస్తే ఏం లాభం. ఈ పాపకి 'ఇస్మార్ట్‌ శంకర్‌' పుణ్యమా అని సూపర్‌ హిట్‌ చేతిలో ఉన్నా, ఎందుకో ఆశించిన రీతిలో అవకాశాలు రావడం లేదు. 'ఇస్మార్ట్‌ శంకర్‌' తర్వాత నిధి అగర్వాల్‌ ఏం చేస్తుంది.? అంటే హాట్‌ హాట్‌ ఫోటో సెషన్‌కే పరిమితమైపోయింది. బాలీవుడ్‌లో ఒకటీ అరా సినిమాలు చేస్తోందనుకోంది. తమిళంలోనూ ఇటీవలే ఓ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మరి టాలీవుడ్‌లో ఈ పాప పర్మినెంట్‌గా సెటిలయ్యేదెప్పుడో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS