చేసినవి మూడే సినిమాలు. వాటిలో మొదటి రెండు సినిమాలూ అంతంత మాత్రమే. కానీ, వాటితోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇక ముచ్చటగా మూడో సినిమాతో ఇస్మార్ట్ గాళ్ అనిపించుకుంది. బ్లాక్ బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఎవరో ఈ పాటికే అర్ధమైపోయుంటుంది. ఆమె ఎవరో కాదు, అందాల నిధి అగర్వాల్. నిధిని చూస్తే అచ్చు ఆ బ్రహ్మదేవుడు తనకు ఎలా కావాలో అలా పోత పోసి చెక్కిన శిల్పంలా అనిపిస్తుంది.
బ్రహ్మదేవున్ని ఎందుకు లాగుతారులే అంటారా? సరే ఆ సంగతి పక్కన పెడితే, హైటూ, వెయిటూ, ఫిగరూ.. గ్లామరూ.. ఇలా చెప్పుకుంటూ పోతే, అన్నీ ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెంచాలో తెలిసిన సృష్టికర్త సృష్టించిన బొమ్మే మరి ఈ ముద్దుగుమ్మ అన్నట్లుంటుంది. ఇకపోతే, సోషల్ మీడియాలో తనకున్న పిచ్చ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి అప్పుడప్పుడూ ఇదిగో ఇలా రెచ్చిపోతుంటుంది నిధి అగర్వాల్. తాజాగా ఓ స్టైలిష్ పిక్‌ని పోస్ట్ చేసింది.
టాప్ టూ బోటమ్ సింగిల్ కలర్ ప్యాటర్న్ డ్రస్సులో పక్కా స్టైలిష్‌గా కనిపిస్తోంది. టాప్‌ని డిఫరెంట్‌గా డిజైన్ చేయించుకుంది. ఓ హ్యాండ్‌ని ఫుల్‌గా కవర్ చేసింది. ఇంకో హ్యాండ్ స్లీవ్‌లెస్‌లా వదిలేసింది. స్లీవ్‌లెస్ సైడ్ నడుము వరకూ ఇచ్చిన కటింగ్ అదిరిపోయింది. లూజ్ హెయిర్‌తో కైపెక్కించే లుక్స్‌తో కిర్రాక్ పుట్టిస్తోంది హాట్ హాట్ నిధి అగర్వాల్.