నిధి అగర్వాల్‌ న్యూ యాంగిల్‌ చూశారా.?

మరిన్ని వార్తలు

లాక్‌డౌన్‌ కారణంగా పాపం అందాల భామలకు ఎన్ని కష్టాలొచ్చాయో చూశారా.? అసలే కెరీర్‌ అంతంత మాత్రంగా ఉన్న నిధి అగర్వాల్‌కి ఐతే ఇది నిజంగా గడ్డు కాలమే . ఎందుకంటారా.. ముచ్చట పడి గ్లామర్‌ షూట్స్‌ చేయించుకుందామంటే కరోనా కారణంగా వీలు కాని పరిస్థితి. దాంతో, ఇదిగో ఇలా కొత్తగా ట్రై చేసింది. వెబ్‌ కెమెరాలో సెల్ఫ్‌ ఫోటో షూట్‌ చేసుకుంది. ఫోటోలో పెద్దగా క్లారిటీ లేకపోయినా, గ్లామర్‌ మాత్రం ఫుల్‌ డోస్‌లో నింపేసింది ఈ పిక్‌లో. బికినీకి ఎక్కువ, బాత్‌ టవల్‌కి తక్కువ అన్నట్లుగా ఉన్న ఓ చిట్టి పొట్టి కాస్ట్యూమ్‌ని మోడ్రన్‌గా ధరించేసి, సింపుల్‌ గ్లామర్‌ లుక్స్‌తో ఫోటోకి పోజిచ్చేసింది.

 

ది బెస్ట్‌ టేస్ట్‌ అని చెప్పలేం కానీ, బ్యాక్‌ గ్రౌండ్‌ కూడా ఓకే, సో పాప కష్టం చూసిన నెటిజన్లు ఓహో ఇస్మార్ట్‌ బాలా.. ఏమి ఈ తెలివితేటలేల .. అంటూ కవిత్వాలు అందుకుంటున్నారు. ఇక ఈ పాప ఫ్యూచర్‌ ప్రాజెక్టుల విషయానికి వస్తే, తమిళంలో ఓ సినిమాలోనూ, గల్లా జయదేవ్‌ కుమారుడు గల్లా అశోక్‌ డెబ్యూ మూవీలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS