తమిళ్‌ బట్టీ పట్టేస్తున్న ఇస్మార్ట్‌ బ్యూటీ.

మరిన్ని వార్తలు

ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌, లాక్‌డౌన్‌ పీరియడ్‌ బాగానే సద్వినియోగం చేసుకుంటోంది. తనకు ఎంతో ఇష్టమైన బొమ్మలు గీసే పనిలో మరింత ప్రాక్టీస్‌ చేస్తోన్న నిధి అగర్వాల్‌, పనిలో పనిగా వంటింట్లో చేరి గరిటె కూడా బాగానే తిప్పేస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే, కెరీర్‌కి సంబంధించి అతి ముఖ్యమైన విషయాల్నీ నేర్చుకుంటోందట నిధి అగర్వాల్‌. ప్రస్తుతం తమిళం నేర్చుకునే పనిలో బిజీగా వున్న నిధి అగర్వాల్‌, ఇందుకు సంబంధించి ఓ ఆసక్తికరమైన ఫొటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇంగ్లీషు పదాలు, వాటికి తెలుగులో అర్థాలు ఓ పేపర్‌ మీద రాసుకుని.. రోజూ ప్రాక్టీస్‌ చేసేస్తోందట.

 

అయితే, టాలీవుడ్‌ అభిమానులు మాత్రం, నిధి అగర్వాల్‌ని ఈ విషయంలో తప్పు పడుతున్నారు. తమిళం వద్దు, తెలుగు ముద్దు.. అంటూ ఆమెకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. అయితే, తనకు తెలుగు బాగా వచ్చేసిందనీ, అయినాగానీ తెలుగులో తాను రెగ్యులర్‌గా మాట్లాడటం ప్రాక్టీస్‌ చేస్తూనే వున్నాననీ, తెలుగుతోపాటు అదనంగా తమిళం నేర్చుకుంటున్నాననీ వివరణ ఇస్తోంది నిధి అగర్వాల్‌. ‘నేనెప్పుడూ డాన్స్‌ చేయడాన్ని ఎంజాయ్‌ చేస్తాను. దాంతోపాటుగా బొమ్మలు గీయడం అంటే ఇష్టం. ఇప్పుడు రకరకాల భాషలు నేర్చుకోవడంపై ఫోకస్‌ పెట్టాను..’ అని చెబుతోంది ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోన్న నిధి, తమిళంలోనూ ఓ రెండు సినిమాలతో బిజీగా వుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS