ఇంట్లోంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి. సామాన్యుడిదీ, సెలబ్రిటీలదీ అదే పరిస్థితి. ఇంకేం చేస్తాం.? సర్దుకుపోతాం.! అంటూ, ఇంట్లోనే రకరకాల వ్యాపకాలు వెతుక్కుంటున్నారు. వెన్నెల కిషోర్ ఇంట్లో చీపురు పట్టుకుని ఊడ్చేస్తే, నాగ శౌర్య తన తల్లితో కలిసి ఇంట్లో ఆవకాయ కలిపాడు. ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్, ఇంట్లో పెయింటింగ్స్ వేస్తూ కూర్చుంది. అన్నట్టు మరో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా, నభా నటేష్‌లానే.. పెయింటింగ్‌తో కుస్తీలు పడుతోందండోయ్. ఈ మేరకు నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అందులో, చాలా సీరియస్‌గా నిధి బొమ్మలు వేసేస్తూ కన్పించింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో కూర్చోవడమే ఆరోగ్యకరం అనీ, కరోనా వైరస్ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని నిధి అగర్వాల్ సూచిస్తోంది. ‘సెల్ఫ్ క్వారంటైన్‌లో వుండండి.. అది మీకు మంచిది, మీ చుట్టూ వున్నవారికీ మంచిది..’ అని చెబుతోంది నిధి అగర్వాల్. సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం నిధి చేతిలో రెండు తెలుగు సినిమాలున్నాయి. రెండు తమిళ సినిమాల్లోనూ నటిస్తోంది నిధి అగర్వాల్. అన్నట్టు, బాలీవుడ్‌లో కూడా నిధి కొన్ని సినిమాలకు సైన్ చేయబోతోందట. నిధి అగర్వాల్‌కి డాన్స్ అంటే ఇష్టం. ఇంట్లో కూర్చుని, ఆ డాన్స్‌ని మరింత బాగా ప్రాక్టీస్ కూడా చేసేస్తోందట.