పిక్ చూస్తున్నారా.? గ్లామర్ పోత పోసినట్లుగా నిధి అగర్వాల్ కనిపిస్తోంది కదా. స్పెషల్ ఫోటో సెషన్ కోసం నిధి ఇలా డిఫరెంట్ కాస్ట్యూమ్‌లో దర్శనమిచ్చింది. పెద్ద పెద్ద డైమండ్లతో డిజైన్ చేసిన లాంగ్ ఫ్రాక్ ధరించింది. హరివిల్లులోని రంగులన్నీ ఆ ఫ్రాక్‌లోనే కనిపిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్‌లో ఓ పెద్ద ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఫోటోకి స్పెషల్ ఎఫెక్ట్ ఇస్తున్నట్లుంది. ఐరన్ స్టెప్స్‌పై రెయిలింగ్‌ని పట్టుకుని వాలు చూపులు చూస్తూ, ఏటవాలుగా నిలబడిన నిధి అగర్వాల్ పోజు పిచ్చ లేపేస్తోంది. కుర్రకారు మదిలో ప్రేమ వీణలు మీటేస్తోంది.
వాస్తవానికి రెగ్యులర్‌గా నిధిలో కనిపించే హాట్‌నెస్ ఈ ఫోటోలో కనిపించకపోయినా, ఫోటో సెషన్ మాత్రం అదిరిపోయింది. సింప్లీ సూపర్బ్ అనేలా ఉంది. ప్రస్తుతం నిధి అగర్వాల్ తమిళంలో ఓ సినిమాలో నటిస్తోంది. తెలుగులో గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ డెబ్యూ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం చర్చల దశలో ఉందట. త్వరలోనే ఫైనల్ కానుందనీ తెలుస్తోంది.