చందమామ కాజల్‌కి కరోనా ఎఫెక్ట్ తీరని నష్టం కలిగించింది. ఎందుకంటారా.? భువనేశ్వర్‌లో ఓ గవర్నమెంట్ ఈవెంట్‌కి సంబంధించి కాజల్ ముఖ్య అతిథిగా హాజరవ్వాల్సి ఉంది. కాజల్ కోసం అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. కొన్ని సర్‌ప్రైజింగ్స్ కూడా ప్లాన్ చేశారట ఈ ప్రోగ్రామ్‌లో కాజల్ ఫ్యాన్స్. అయితే, కరోనా కారణంగా జనం ఎక్కువగా ఫామ్ అయ్యే ఈవెంట్స్ రద్దు అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ఈవెంట్ కూడా రద్దు చేసేశారు. పాపం ఈ ఈవెంట్‌పై కాజల్ చాలా ఆశలు పెట్టుకుందట. అలాగే ఫ్యాన్స్ కూడా. తాజా అనౌన్స్‌మెంట్ ఇటు కాజల్‌నీ, అటు ఫ్యాన్స్‌నీ నిరుత్సాహపరిచింది. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా కాజల్ స్పందించింది.
‘‘కరోనా కారణంగా ఈ ఈవెంట్‌కి హాజరు కాలేకపోతున్నందుకు సారీ..’ అంటూ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి ఓ ట్వీట్ చేసింది. ఏంటో ఈ మహమ్మారి, ఎంతో మందిని ఎన్నో రకాలుగా దెబ్బ తీసేస్తోంది. వరల్డ్ మొత్తం వణికిస్తున్న ఈ కరోనా మహమ్మారి కారణంగా, వ్యవస్థలన్నీ సర్వనాశనమైపోతున్నాయి. సినీ పరిశ్రమకు కరోనా తీరని నష్టం కలిగిస్తోంది. కోటి ఆశలతో సినిమాలు తెరకెక్కించిన ఫిలిం మేకర్స్ లబో దిబోమంటున్నారు. ఎన్నాళ్లగానో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నకొందరు హీరోలు, హీరోయిన్ల ఆశలపై అన్యాయంగా నీళ్లు చల్లేస్తోందీ కరోనా వైరస్.. అలియాస్ కోవిడ్ 19.