నిధి చేతికి ఆ ప్రాజెక్ట్‌ చిక్కిందోచ్‌!

By Inkmantra - November 08, 2019 - 14:30 PM IST

మరిన్ని వార్తలు

ప్రముఖ రాజకీయ వేత్త, సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుకు బావ అయిన గల్లా జయదేవ్‌ కుమారుడు అశోక్‌ గల్లా హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. నవంబర్‌ 10న ఈ సినిమా గ్రాండ్‌గా లాంఛ్‌ కానుంది. రామానాయుడు స్టూడియోలో పలువురు సినీ రాజకీయ ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ సినిమాని లాంఛ్‌ చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా క్రేజీయెస్ట్‌ భామని ఎంచుకోవాలనుకున్నారు. ఆ క్రమంలో ఇస్మార్ట్‌ గాళ్‌ నిధి అగర్వాల్‌ పేరు మొదట తెరపైకి వచ్చింది. అయితే, అది ఉత్త గాలి వార్తే అనుకున్నారు. కానీ, నిధి అగర్వాల్‌ని అధికారికంగా కన్‌ఫామ్‌ చేసింది తాజాగా చిత్రయూనిట్‌.

 

సో నిధి అగర్వాల్‌ చేతికి ఈ ప్రాజెక్ట్‌ దక్కినట్లే. 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాతో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టిన నిధి అగర్వాల్‌కి భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ ఇచ్చి ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంచుకున్నారనీ తెలుస్తోంది. గల్లా పద్మావతి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌ శ్రీరామ్‌ ఆదిత్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. యూత్‌ పల్స్‌ బాగా తెలిసిన విలక్షణ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య. ఈ సినిమాని డిఫరెంట్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నాడట. జిబ్రాన్‌ ఈ సినిమాకి బాణీలు అందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS