‘‘అభిమానులకు దగ్గరయ్యేందుకు మీడియా మాకు ఎంతో ఉపకరిస్తుంది. చాలా మీడియా సంస్థలు చాలా చాలా బాధ్యతగా వ్యవహరిస్తుంటాయి. ఈ విషయంలో మీడియాకి ఎప్పుడూ మేం నటులుగా కృతజ్ఞతలు చెబుతూనే వుంటాం’’ అంటోంది ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. అయితే, గాసిప్స్ ఒక్కోసారి సరదాగా వుంటాయనీ, కొన్ని సార్లు మాత్రం బాధను కలిగిస్తాయని ఈ బ్యూటీ అభిప్రాయపడింది. విమర్శల్ని స్వీకరించడానికి నటులుగా మేమెప్పుడూ సిద్ధంగా వుంటామని చెబుతున్న ఈ ఇస్మార్ట్ భామ, విమర్శల పేరుతో పనిగట్టుకుని వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని ఓ సెక్షన్ మీడియాపై తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టింది.
తెలుగు సినిమా, ఇప్పుడు ఓ మూడు నాలుగు ‘గాసిప్ వెబ్‌సైట్స్’పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఈ విషయమై నిధి అగర్వాల్ కూడా స్పందించింది. విజయ్ దేవరకొండ అభిప్రాయాలతో తానూ ఏకీభవిస్తున్నాననీ, సినీ నటులుగా తాము మంచి పనులు చేస్తున్నప్పుడు, పైగా కరోనా వైరస్ నేపథ్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అందులో లేని నెగిటివిటీని చూపించాలనుకోవడం హేయమైన చర్య అని నిధి అగర్వాల్ అభిప్రాయపడింది. ‘కిల్ ఫేక్ న్యూస్’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ని యాడ్ చేసింది నిధి అగర్వాల్. విజయ్ దేవరకొండకు మద్దతు పలుకుతున్నవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది.
As someone who loves & respects the media,it is bcuz of all the lovely media houses tht we actors are able to reach more audiences.Hvng said this,I dnt support putting down anyone who is dng charitable work in this time,like @TheDeverakonda is. #KillFakeNews 🙏🏼✨spread positivity
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) May 5, 2020