హిట్‌ కొట్టినా 'నిధి'కి లక్కు చిక్కలేదు.!

మరిన్ని వార్తలు

2019లో 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాతో బిగ్గెస్ట్‌ హిట్‌ కొట్టిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. అప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా, అమ్మడికి కలిసి రాలేదు. పూరీ పుణ్యమా అని మూడో సినిమా 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో ఇస్మార్ట్‌ హిట్‌ కొట్టేసింది. ఇంకేముంది. ఈ హిట్‌ నిధి కెరీర్‌కి బాగా కలిసొస్తుందనుకున్నారంతా. ఎందుకో అంత పెద్ద హిట్‌ కొట్టినా నిధి అగర్వాల్‌ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. స్టార్‌ హీరోల సరసన ఛాన్స్‌ దక్కించుకుని బిజీ అయిపోతుందేమో అనుకుంటే, ఓ డెబ్యూ హీరోకి కనెక్ట్‌ అయ్యింది. ఆయన ఎవరో కాదు, మహేష్‌ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్‌ కుమారుడు అయిన గల్లా అశోక్‌. త్వరలో ఈయన హీరోగా డెబ్యూ చేస్తున్న సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.

 

ఈ ఒక్క ఛాన్స్‌ తప్ప నిధి అగర్వాల్‌ చేతిలో మరో తెలుగు ఛాన్స్‌ లేదు. తమిళంలో ఓ సినిమాలో నటిస్తోంది. త్వరలో ఆ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇలా అందాల నిధికి అన్నీ ఉన్నా, ఇంకా ఏదో డాష్‌ డాష్‌ అన్నట్లుగా 2019 పెద్దగా కలిసి రాలేదు. కానీ, 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాలో నిధి అగర్వాల్‌ అందాల ఆరబోతను మాత్రం ఆడియన్స్‌ అస్సలు మర్చిపోలేరు. చూడాలి మరి, కొత్త సంవత్సరంలోనైనా నిధి అందాలకు తగిన గుర్తింపు దక్కుతుందేమో.  


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS