చిత్రసీమనీ - గాసిప్‌ని విడదీసి చూడలేం. ఈ ఫీల్డ్ లో గాసిప్ పుట్టని రోజు ఉండదు. గాసిప్ ఎదుర్కోని తార కనిపించదు. కొంతమంది గాసిప్పుల్ని కూడా ప్రసార అస్త్రాలు గా వాడుకుంటారు. ఇంకొంతమంది ఆ పేరు చెబితే చాలు, భయపడిపోతారు. నిధి అగర్వాల్ ఆ కోవకే చెందుతుంది. తనకు గాసిప్పులంటే అస్సలు ఇష్టం ఉండదట. తను గురించి ఒకరు తెలిసీ తెలియని విషయాలు మాట్లాడుకోవడం తనకు నచ్చదని తెగేసి చెబుతుంది. తనపై ఎలాంటి గాలివార్తలూ రాలేదని, అందుకు తాను ఎంచుకున్న మార్గమే కారణమని అంటోంది.
తనకి బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని, అసలు తనకో తోడు కావాలని అస్సలు అనుకోవడం లేదని, అందుకే తనపై ఎలాంటి పుకార్లూ పుట్టలేదని చెప్పుకొచ్చింది. ఎక్కడికైనా, ఎవరితో అయినా బయటకు వెళ్లేముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుందట. తన స్నేహితులు కూడా చాలా తక్కువ మందే ఉన్నారంటోంది. అందుకే... జనాలు చిలవలు, పలవలుగా మాట్లాడుకోవడం లేదట. అదీ.. తన వెనుక ఉన్న సీక్రెట్టు.