ఎన్టీఆర్ ప‌క్క‌న నిధి అగ‌ర్వాల్?

By Gowthami - June 21, 2021 - 17:42 PM IST

మరిన్ని వార్తలు

ఇస్మార్ట్ శంక‌ర్ తో నిధి అగ‌ర్వాల్ కెరీర్ ట‌ర్న్ అయ్యింది. ఆమెకు ఇప్పుడు మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`లో త‌నే క‌థానాయిక‌. ఇప్పుడు ఎన్టీఆర్ తోనూ జోడీ క‌ట్టే ఛాన్స్ ద‌క్కించుకుంద‌ని టాక్‌. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం `ఆర్‌.ఆర్‌.ఆర్‌`తో బిజీగా ఉన్నాడు. ఆ త‌ర‌వాత‌... కొర‌టాల శివ‌తో ఓ సినిమా చేయాల్సివుంది. ప్ర‌శాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఈ సినిమాకి ఇంకా చాలా స‌మ‌య‌మే ఉంది. కానీ న‌టీన‌టులు, సాంకేతిన నిపుణుల విష‌యంలో ప్ర‌శాంత్ నీల్ తొంద‌ర‌ప‌డుతున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా విజ‌య్ సేతుప‌తిని ఎంచుకున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు హీరోయిన్ కూడా ఫిక్స‌యిపోయింద‌ని టాక్‌.

 

ఎన్టీఆర్ కోసం నిధి అగ‌ర్వాల్ ని ఎంచుకున్న‌ట్టు టాలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీస్ ఇప్ప‌టికే నిధిని సంప్ర‌దించి, డేట్లు లాక్ చేసేసింద‌ని స‌మాచారం అందుతోంది. ఎన్టీఆర్ పక్క‌న సినిమా అంటే నిధి బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన‌ట్టే. అయితే ఇందులో నిధి మాత్ర‌మే హీరోయిన్ కాదు. మ‌రో క‌థానాయిక‌కీ ఛాన్సుంది. ఆమెని బాలీవుడ్ నుంచి దిగుమ‌తి చేసే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. మొత్తానికి ప్ర‌శాంత్ నీల్.. కాస్త స్పీడుమీదే ఉన్నాడు. చేతిలో స‌లార్ ఉన్న‌ప్ప‌టికీ, కేజీఎఫ్ 2 చాప్ట‌ర్ మిగిలే ఉన్న‌ప్ప‌టికీ.. ఎన్టీఆర్ సినిమాపై ఫోక‌స్ పెడుతున్నాడు. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమాలోని న‌టీన‌టుల్ని ఫిక్స్ చేసి, ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS