త‌మ‌న్ కి ప్ర‌త్యామ్నాయంగా మారుతున్నాడా?

By iQlikMovies - June 21, 2021 - 14:10 PM IST

మరిన్ని వార్తలు

తెలుగులో పెద్ద సినిమాలు అన‌గానే సంగీత ద‌ర్శ‌కుడిగా త‌మ‌న్ ముందు గుర్తొస్తున్నాడు. ఆ త‌ర‌వాత‌.. దేవిశ్రీ ప్ర‌సాద్ ఎలానూ ఉండ‌నే ఉన్నాడు. ఇక మ‌ణిశ‌ర్మ ఈమ‌ధ్యే ఫామ్ లోకి వ‌చ్చాడు.

 

అయితే హీరోలంద‌రి తొలి ఛాయిస్ త‌మ‌నే అవుతున్నాడు. అయితే... ఇప్పుడు మెల్ల‌మెల్ల‌గా త‌మ‌న్ కి ప్ర‌త్యామ్నాయంగా అనిరుధ్ మారుతున్నాడేమో అనిపిస్తోంది. ఈమ‌ధ్య కొన్ని పెద్ద ప్రాజెక్టుల‌కు అనిరుథ్ పేరు బ‌య‌టకు వ‌చ్చింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ `అజ్ఞాత‌వాసి`, నాని `గ్యాంగ్ లీడ‌ర్‌` సినిమాల‌కు అనిరుథ్ సంగీతం అందించాడు. ఈ రెండు సినిమాలూ ఫ్లాప్‌. పాట‌లు కూడా అంత‌గా ఎక్క‌లేదు. అందుకే అనిరుథ్ ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అయితే ఇప్పుడ అనిరుథ్ వైపు చూస్తున్నారు ద‌ర్శ‌కులు. హీరోలు. ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి అనిరుథ్ ని సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. అంతే కాదు.. రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబోలో రూపొందే చిత్రం కూడా అనిరుథ్ ఖాతాలోకి వెళ్లిపోయింద‌ని టాక్‌. త్రివిక్ర‌మ్ - మ‌హేష్ కాంబినేష‌న్ లో ఓ సినిమా రాబోతోంది.

 

ఈ సినిమాకి మ‌ణిశ‌ర్మ‌ని సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంచుకున్నార‌ని ప్ర‌చారం జరుగుతోంది. అయితే అనిరుథ్ పేరు కూడా ఓ ఆప్ష‌న్ గా పెట్టుకున్నార్ట‌. అదే నిజ‌మైతే.. వ‌రుస‌గా మూడు పెద్ద ప్రాజెక్టులు అనిరుథ్ చేతికి వెళ్లిన‌ట్టే. ఇందులో ఏ ఒక్క‌టి క్లిక్ అయినా... కొన్నాళ్లు త‌న పేరు మార్మోగ‌డం ఖాయం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS