గ్లామ్‌షాట్‌: కైపెక్కించే గ్లామర్‌ 'నిధి'

మరిన్ని వార్తలు

కోటి వీణలు ఒకేసారి శృతి కలిస్తే ఎలా ఉంటుందో అలాంటి అందం నిధి అగర్వాల్‌ సొంతం. బ్రేక్‌ రావడం లేదు.. కానీ, ఒక్కసారి బ్రేక్‌ వచ్చిందా అంతే సంగతి చెడుగుడు ఆడించేయగల సత్తా ఉంది అమ్మడిలో. ఎలాంటి వారినైనా ఇంప్రెస్‌ చేయగల గ్లామర్‌ నిధిలో దాగుంది. ఆమె అలా ఒక్క చూపు చూస్తే చాలు కోటి రాగాలు మనసులో ప్రేమ మృదంగమాడేస్తాయి. సినిమాల్లోకి రాకముందే అమ్మడికి సోషల్‌ మీడియాలో బోలెడంత ఫాలోయింగ్‌ ఉంది. అందుకు కారణం ఆమె గ్లామర్‌ రహస్యమే. తాజాగా సోషల్‌ మీడియాలో నిధి పోస్ట్‌ చేసిన ఓ పిక్‌కి సింప్లీ సూపర్బ్‌ అనేలా రెస్పాన్స్‌ వస్తోంది. ముందే చెప్పుకున్నాం కదా, ఆమె అలా చూస్తే చాలు.. అని, అలాంటిది కైపుగా ఇలా చూస్తే ఇంకేంటి.. ఢమాల్‌ అంతే మరి. అదే జరుగుతోందిక్కడ.

 

వైట్‌ షర్ట్‌ని పైకి ముడి పెట్టి, కనీ కనిపించని బ్లాక్‌ ఇన్నర్‌ వేర్‌లోంచి క్లీవేజ్‌షో చేసి ఎలా కవ్విస్తుందో చూశారుగా. గ్లామర్‌ సంగతి సరే, సక్సెస్‌ మాత్రం సీత కన్నేస్తోంది అమ్మడిపై. అయితే, త్వరలో రానున్న 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాపై నిధి గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ఎలాగైనా నిధి అందాలకు అసలు సిసలు విలువ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఉంది అందాల భామ నిధి అగర్వాల్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS