పేరు మేఘాంష్. కుర్రాడు ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాడు. అసలింతకీ ఎవరీ మేఘాంష్ అంటే, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విలన్‌గా తనదైన ముద్ర వేసిన నటుడు శ్రీహరి. విలక్షణ పాత్రల్లో తనదైన శైలి నటనతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాడు శ్రీహరి. ఆ శ్రీహరి వారసుడే ఈ మేఘాంష్. 'రాజ్‌దూత్' అనే సినిమాతో డెబ్యూ ఇస్తున్నాడు. లేటెస్ట్‌గా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. టీజర్‌లో కుర్రాడు బాగున్నాడు. యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి. డెబ్యూ మూవీ అయినా, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటోంది. ఇక అన్నింటికీ మించి ఈ సినిమా కథ 'రాజ్‌దూత్' అనే ఓ బైక్ చుట్టూ తిరుగుతుంది. ఈ బైక్ సినిమాలో అత్యంత కీలకం. మరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ బైక్ మాట్లాడుతుంది. దానికి సునీల్ వాయిస్ చాలా పెద్ద ప్లస్ అయ్యింది. అప్పుడెప్పుడో సునీల్ ప్రధాన పాత్రలో నటించిన 'మర్యాదరామన్న' సినిమాలో ఓ సైకిల్ ఉంటుంది.
రవితేజ వాయిస్‌తో ఆ సైకిల్ మాట్లాడుతుంది. అప్పట్లో అది కొత్తగా అనిపించింది ఆడియన్స్‌కి. అలాగే ఇప్పుడు రాజ్‌దూత్ (బైక్) కూడా మాట్లాడుతుంది. ఇలా కథని కొంచెం కొత్తగా మలిచే ప్రయత్నం చేశారు మేఘాంష్ కోసం. లేత కుర్రాడు, చాకులా ఉన్నాడు. డెబ్యూనే అయినా వంకలు పెట్టడానికేమీ లేదు. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. సో కనెక్ట్ అయ్యిందంటే మేఘాంష్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోగా తండ్రి శ్రీహరి పేరు నిలబెడతాడు అనడం అతిశయోక్తి కాదేమో. టీజరే అయినా అన్ని అంశాల్నీ టచ్ చేశారు. మామూలుగా డెబ్యూ మూవీస్ అంటే రెగ్యులర్ లవ్‌స్టోరీస్‌నే ఎంచుకుంటారు. కానీ మేఘాంష్ తొలి సినిమాకే డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకుని సమ్‌థింగ్ డిఫరెంట్ అనిపిస్తున్నాడు. అర్జున్ - కార్తీక్ ద్వయం ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.