గ్లామ్‌షాట్‌: 'సవ్యసాచి' సొగసుల 'నిధి'

By iQlikMovies - October 26, 2018 - 18:18 PM IST

మరిన్ని వార్తలు

'సవ్యసాచి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతోన్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌కి సోషల్‌ మీడియాలో అప్పుడే బోలెడంత ఫాలోయింగ్‌ వచ్చేసింది. అందుకు కారణం ఈ ముద్దుగుమ్మ హాట్‌ అప్పీలే. 'సవ్యసాచి' నుండి బయటికి వచ్చిన ప్రచార చిత్రాల్లోనూ అమ్మడు గ్లామరస్‌ లుక్స్‌తోనే కనిపిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్‌ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఆ మాటకొస్తే, నిధి ఏ పిక్‌ పోస్ట్‌ చేసినా అది వైరల్‌ అవడం పరిపాటి అయిపోయింది. ఆమె అందానికి అంతగా ఫాలోవర్స్‌ వచ్చేశారు మరి. అక్కినేని కాంపౌండ్‌తో ఎంట్రీ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ బ్యాక్‌ టు బ్యాక్‌ ఇద్దరు అక్కినేని హీరోస్‌నీ ఇంప్రెస్‌ చేసేసిందంటే అందుకు కారణం ఇదే కాబోలు. ఒకవేళ 'సవ్యసాచి'తో హిట్‌ కొట్టిందా.. అమ్మడికి ఓ రేంజ్‌లో క్రేజ్‌ వచ్చేస్తుంది.

ఈ సొగసుల నిధి సొంతం చేసుకోబోయే సక్సెస్‌కి ఇంకెంతో దూరం లేదు మరి. నవంబర్‌లోనే 'సవ్యసాచి'తో ప్రేక్షకులను పలకరించేయనుంది అందాల నిధి అగర్వాల్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS