'మజ్ను'కైనా 'నిధి' కలిసొచ్చేనా.!

By iQlikMovies - November 29, 2018 - 12:43 PM IST

మరిన్ని వార్తలు

అఖిల్‌ హీరోగా తెరకెక్కుతోన్న మూడో చిత్రం 'మిస్టర్‌ మజ్ను' షూటింగ్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది. లండన్‌లో ఎక్కువ భాగం షూటింగ్‌ జరుపుకున్న ఈ సినిమాకి ఇప్పుడు హైద్రాబాద్‌లో ఫినిషింగ్‌ టచ్‌ జరుగుతోంది. మొదట్లో ఈ సినిమాని డిశంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. నాగార్జునకి డిశంబర్‌ బాగా కలిసొచ్చే నెల కావడంతో అఖిల్‌ మూడో సినిమా అయిన 'మిస్టర్‌ మజ్ను'కి డిశంబర్‌ మంత్‌నే బెస్ట్‌ మంత్‌గా ఎంచుకున్నారట.

కానీ డిశంబర్‌లో ఈ సినిమా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు కానీ, ఎలాగైనా డిశంబర్‌ 3 కల్లా షూటింగ్‌ పనులు పూర్తి చేసే యోచనలో ఉన్నారట. ఆ తర్వాత ప్రమోషన్స్‌ వేగవంతం చేయనున్నారట. ఈ సారి అఖిల్‌ సినిమా ప్రమోషన్స్‌ విషయంలో నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకోనున్నాడట. భారీ ఎత్తున ప్రమోషన్స్‌ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడట. జనవరి ఆఖరి వారంలో మిస్టర్‌ మజ్నుని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారనీ తాజా సమాచారమ్‌.

ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ ఈ సినిమాలో అఖిల్‌కి జోడీగా నటిస్తోంది. ఆల్రెడీ అన్నయ్య నాగచైతన్యతో 'సవ్యసాచి' సినిమాలో నటించింది నిధి అగర్వాల్‌. 'సవ్యసాచి'తో చైత బిగ్గెస్ట్‌ హిట్‌ కొడతాడని భావించారంతా. కానీ కుదరలేదు. అఖిల్‌కైనా ఈ అందాల నిధి అదృష్ట దేవత అవుతుందా.? లేదా.? చూడాలి మరి. బివియస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకుడు. తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS