'ఎన్టీఆర్‌' బయోపిక్‌పై మెగా గాసిప్‌ నిజమేనా..?

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ భారీ కాస్టింగ్‌తో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ బయోపిక్‌ కోసం మెగాస్టార్‌ చిరంజీవిని తీసుకొస్తున్నారట. ఎన్టీఆర్‌కీ, చిరంజీవికీ అప్పట్లో మంచి సన్నిహిత సంబంధాలుండేవి. బాలకృష్ణ, చిరంజీవి మంచి ఫ్రెండ్స్‌. అభిమానుల పరంగా మాత్రం నందమూరి వెర్సస్‌ మెగా ఫ్యాన్స్‌ ఫైట్‌ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కానీ ఆఫ్‌ స్క్రీన్‌ మెగాస్టార్‌, బాలయ్యలు మాత్రం చాలా సన్నిహితంగా ఉంటారు.

గతంలో స్వర్గీయ ఎన్టీఆర్‌తో చిరంజీవి ఓ సినిమాలో కలిసి నటించారు. ఎన్టీఆర్‌ పేరు లేకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడుకోలేం. అంతటి ప్రాముఖ్యత తెలుగు సినిమా విషయంలో ఎన్టీఆర్‌కి ఉంది. అందుకే తెలుగు సినిమాకి సంబంధించి, ప్రముఖులందర్నీ ఈ సినిమాలో భాగస్వామ్యం చేయాలని ఎన్టీఆర్‌ టీమ్‌ భావిస్తోందట. ఆ క్రమంలోనే చిరంజీవిని బాలయ్య అండ్‌ టీమ్‌ సంప్రదించారనీ తెలుస్తోంది. అయితే ఇదంతా ప్రస్తుతానికి గాసిప్‌ మాత్రమే. కానీ నిజమైతే ఆ కిక్కే వేరప్పా.

మరోవైపు నందమూరి ఫ్యామిలీ నుండి జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా ఫ్యామిలీ నుండి రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఆల్రెడీ సెట్స్‌ మీదుంది. ఒకవేళ పైన చెప్పుకున్న గాసిప్‌ నిజమైతే, వారసుల కంటే ముందే మెగా మల్టీ స్టారర్‌ ప్రేక్షకుల ముందుకొచ్చేసినట్లే అవుతుంది. సంక్రాంతికి ఎన్టీఆర్‌ బయోపిక్‌ రిలీజ్‌ కానుంది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' కంప్లీట్‌ కావడానికి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి. ఈలోగా ఇరువర్గాల అభిమానులు ఇలా పండగ చేసుకోవచ్చేమో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS