మెగా డాటర్ నిహారిక విడాకుల వార్త మరోసారి చర్చకు వచ్చింది. 2020లో చైతన్యతో.. నిహారిక పెళ్లి జరిగింది. పెళ్లయ్యాక సినిమాలకు, వెబ్ సిరీస్‌లకూ దూరమైంది నిహారిక. అయితే.. కొన్నాళ్లుగా నిహారిక, చైతన్య కలిసి ఉండడం లేదని, ఇద్దరి మధ్యా గ్యాప్ వచ్చిందన్న వార్తలు బయటకు వచ్చాయి. వీటిపై.. నిహారిక గానీ, చైతన్య గానీ స్పందించలేదు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ విడాకులు తీసుకొన్నారన్న వార్తలకు ఊపొచ్చింది. తాజాగా నిహారిక, చైనత్యలు సోషల్ మీడియాలో.. తమ పెళ్లి ఫొటోల్ని డిలీట్ చేసేశారు. అంతేకాదు.. ఒకర్ని ఒకరు అన్ ఫాలో కూడా అయ్యారు. దీన్ని బట్టి వీరిద్దరూ విడాకులు తీసుకొన్నారన్న వార్తలకు బలం వచ్చినట్టైంది.
నాగచైతన్య - సమంతల విషయంలోనూ అదే జరిగింది. వారిద్దరి విడాకులకు సంబంధించిన వార్తలు బయటకువచ్చిన తరవాతే.. ఇద్దరూ సోషల్ మీడియాలో అన్ ఫాలో అయ్యారు. అంతే కాదు.. పెళ్లి ఫొటోల్నీ డిలీట్ చేశారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. సో... నిహారిక, చైతన్యలు విడిపోయారన్నది స్పష్టం. కాకపోతే అధికారికంగా ఎవరూ దీన్ని ఖరారు చేయలేదు. త్వరలోనే నిహారిక, చైతన్యలు సోషల్ మీడియాలో తమ విడాకుల గురించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.