నిహారిక పెళ్లి... ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. తనకో జోడీ దొరికిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాని రెండ్రోజుల నుంచీ హింట్ మీద హింట్ ఇస్తూ వచ్చింది నిహారిక. కాబోయే వరుడి ఫొటో చూపించీ, చూపించకుండా దాగుడు మూతలు ఆడింది. ఇప్పుడు ఆ ఫొటో బయటపెట్టింది. పిల్లాడు.. హీరోలానే ఉన్నాడు. తనకు సంబంధించిన వివరాలన్నీ ఇప్పుడు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి.
తన పేరు చైతన్య. గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకరరావు కుమారుడు చైతన్య. బిట్స్ పిలానీలో చదువకున్నాడు. ఇప్పుడు టెక్ మహేంద్రలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరికీ పెద్దలు కుదిర్చిన పెళ్లే. ఆగస్టు 13న నిశ్చితార్థం జరగబోతోంది. ఈ యేడాది డిసెంబరులోనే పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. చైతన్య అందంగా ఉన్నాడు. హీరోలా ఉన్నాడు. సో.. మెగా కుటుంబం చైతన్యని హీరోగా పరిచయం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో..?