కాస్టింగ్‌ కౌచ్‌పై వారిద్దరూ ఏమన్నారంటే.!

By iQlikMovies - August 01, 2018 - 15:54 PM IST

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో నటి శ్రీరెడ్డి 'కాస్టింగ్‌కౌచ్‌'పై లేవనెత్తిన పబ్లిసిటీతో మూల మూలల నుండి మూలాలు కదిలి వెలుపలికి వచ్చాయి. ఈ ఇష్యూ తర్వాత వీరూ వారూ అనే తేడా లేకుండా, తమదైన శైలిలో పలువురు కాస్టింగ్‌ కౌచ్‌ బాధితులమంటూ బయటికి వచ్చారు. కొందరు కాస్టింగ్‌ కౌచ్‌లాంటివేమీ లేవు అని ఖండించారు. అయితే తాజాగా మెగా డాటర్‌ నిహారిక కాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించింది. 

మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు ముఖ్యంగా సినీ పరిశ్రమ విషయానికే వస్తే, మన ప్రమేయం లేకుండా వేధింపులు అనేవి జరగడం అసాధ్యం. ఎంతో కొంత మన ప్రమేయం కూడా ఉండి తీరాలి అని సంచలన వ్యాఖ్యలు చేసింది నిహారిక. 

ఇకపోతే తాజాగా 'సమ్మోహనం' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ అదితీరావ్‌ హైదరి కూడా స్పందించింది. బాలీవుడ్‌లో సినిమాలు చేసే క్రమంలో ఈ ముద్దుగుమ్మ కూడా కాస్టింగ్‌ కౌచ్‌ని ఎదుర్కొన్నానని చెప్పింది. అంతేకాదు, కాస్టింగ్‌కౌచ్‌ కారణంగా తాను చాలా ఇంపార్టెంట్‌ ఛాన్సెస్‌ వదులుకోవాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయనీ చెప్పుకొచ్చింది. 'సమ్మోహనం' సినిమాలో తాను పోషించిన పాత్రలో ఈ ఇష్యూకి సంబంధించిన సీన్స్‌లో అంత లైవ్‌గా నటించడానికి పర్సనల్‌ లైఫ్‌లో తాను ఎదుర్కొన్న సంఘటనలే కారణమని చెప్పింది. 

ప్రస్తుతం అదితీరావ్‌ హైదరీ మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌తో 'అంతరిక్షం' సినిమాలో నటిస్తోంది. మెగా డాటర్‌ నిహారిక ఇటీవలే 'హ్యాపీ వెడ్డింగ్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రియ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఓ చిత్రంలో నిహారిక కీలక పాత్ర పోషిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS