మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రానికి షూటింగ్ దశలోనే అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ఒక సెట్ ని ప్రభుత్వ అధికారులు కూల్చివేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ శివార్లలో సైరా షూటింగ్ కోసం ప్రభుత్వ స్థలంలో ఒక సెట్ వేయడం జరిగింది. అయితే అది ప్రభుత్వ స్థలం అయిన కారణంగా రెవిన్యూ అధికారుల నుండి తగు అనుమతులు తీసుకోవాల్సి ఉండగా చిత్ర యూనిట్ అలాంటి నిబంధనలు ఏమి పాటించలేదు.
దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు పలుమార్లు చిత్ర యూనిట్ కి నోటిసులు ఇవ్వగా వారు స్పందించలేదు అలాగే అనుమతి కూడా కోరలేదు. దీనితో వారు ఆ స్థలంలో ఉన్న సెట్ ని కూల్చివేయడం జరిగింది అని తెలుస్తుంది.
ఇప్పటికే పలు లీకులతో సతమతమవుతున్న సైరా చిత్ర బృందానికి ఈ సెట్ కూల్చివేత మరో పెద్ద షాక్ అనే చెప్పాలి.