నిహారిక అస్సలు తగ్గట్లేదుగా.!

By Inkmantra - February 29, 2020 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

మెగా డాటర్‌ నిహారిక అస్సలు తగ్గడం లేదు. ఈ మధ్య గ్లామర్‌ తెరలు తెంచేసి, బాలీవుడ్‌ హీరోయిన్స్‌ని మించిపోయి ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ స్పెషల్‌ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతున్న నిహారిక, లేటెస్ట్‌గా మరో రెండు హాట్‌ ఫోటోస్‌ని దించింది. మొన్న చేసిన దానికే ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్స్‌ చేస్తుంటే, అవేం తనకు పట్టవంటూ, అస్సలేమాత్రం కేర్‌ చేయకుండా మళ్లీ గ్లామర్‌ షోకి తెర లేపిన నిహారికను ఫ్యాన్స్‌ ర్యాగింగ్‌ చేస్తున్నారు. ఇంతవరకూ నిహారికపై ఉన్న అభిమానం ఈ గ్లామర్‌ షోతో పోయిందంటూ ఫ్యాన్స్‌ వాపోతున్నారు.

 

అయితే, వన్స్‌ గ్లామర్‌ రంగంలో అడుగు పెట్టాకా ఇలాంటి ట్రోల్స్‌ కామన్‌. నిహారిక తీరు చూస్తుంటే, ప్రొఫిషన్‌ని చాలా ప్యాషన్‌గా తీసుకున్నట్లే ఉంది. ప్యాషన్‌ ముందు ఇలాంటి ట్రోల్స్‌, ర్యాగింగ్స్‌ తాటాకు చప్పుళ్ల వంటివే. పర్సనల్‌ లైఫ్‌ వేరు, ప్రొఫిషనల్‌ లైఫ్‌ వేరు. సో నిహారిక తీరును కొందరు సమర్ధిస్తున్నారు. ఏది ఏమైనా సెబ్రిటీలు ఇలాంటివి పట్టించుకుంటే, కెరీర్‌లో ముందుకు వెళ్లలేరనేది వాస్తవం. ఆ వాస్తవాన్ని గ్రహించిన గడుసు పిల్ల కాబట్టే, కామ్‌గా తన పని తాను చేసుకుపోతోంది కొణిదెల నిహారిక. అయితే, ప్రస్తుతం నిహారిక నటిస్తున్న ఫిలిం ప్రాజెక్ట్స్‌పై పెద్దగా ఇన్‌ఫామేషన్‌ లేదు కానీ, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో వరుస వెబ్‌ సిరీస్‌తో నిహారిక ఫుల్‌ బిజీ బిజీగా గడుపుతుంటుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS