ఫ్యాన్స్‌కి టార్గెట్‌ అయిన మెగా డాటర్‌.!

By Inkmantra - February 20, 2020 - 08:30 AM IST

మరిన్ని వార్తలు

మెగా డాటర్‌ నిహారిక ఈ మధ్య గ్లామర్‌ తెరలు తెంచేసింది. హాట్‌ హాట్‌ ఫోటో సెషన్స్‌ చేయించుకుంటూ, సోషల్‌ మీడియాని హీటెక్కించడం పనిగా పెట్టుకుంది. ఎంత హీరోయిన్‌గా అవకాశాలు రాకపోతే మాత్రం ఇంతలా దిగజారిపోతారా? మెగాస్టార్‌ చిరంజీవి గౌరవం ఏం కావాలి? అంటూ నెటిజన్లు నిహారికను ఆడిపోసుకుంటున్నారు. గతంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ కూతురుకీ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. సూపర్‌ స్టార్‌ కృష్ణ పరువుకు భంగం కలిగితే ఒప్పుకోమంటూ, ఫ్యాన్స్‌ ఆందోళనకు దిగడంతో, హీరోయిన్‌ కావానుకున్న తన కోరికను మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది నటి మంజులకు. దాంతో టెక్నికల్‌ ఫీల్డ్‌లో సెటిలైపోయింది.

 

అయితే, అడపా దడపా చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది మంజుల. తాజాగా ఇలాంటి పరిస్థితే ఇప్పుడు నిహారిక ఎదుర్కోవాల్సి వస్తోంది. నిహారికను హీరోయిన్‌గా ఫ్యాన్స్‌ యాక్‌సెప్ట్‌ చేశారు. కానీ, గ్లామర్‌లెస్‌ హీరోయిన్‌గా మాత్రమే నిహారికకు ఛాన్సిచ్చారు. ఇంతవరకూ నిహారిక కూడా ఎక్స్‌పోజింగ్‌కి ఛాన్స్‌ తీసుకోలేదు. కానీ, ఈ మధ్య ఏమైందో ఏమో కానీ, సోషల్‌ మీడియా వేదికగా పొట్టి పొట్టి డ్రస్సులతో హాట్‌ హాట్‌ పోజులతో రెచ్చిపోతోంది నిహారిక. లేటెస్ట్‌గా ఇన్నర్‌ వేర్‌ని ఎక్స్‌పోజ్‌ చేస్తూ దిగిన ఫోటోతో నెటిజన్లు నిహారికను ఆటాడేసుకుంటున్నారు. అయితే, నిహారిక ఈ కాలం అమ్మాయి. రోజులు కూడా మారాయి. ఎవరి స్వేచ్ఛనూ ఎవరూ అడ్డుకోవడానికి వీల్లేని రోజులివి. ఇలాంటి తరుణంలో ఫ్యాన్స్‌ అభిప్రాయాల్ని నిహారిక స్వీకరిస్తుందా.? లైట్‌ తీసుకుంటుందా.? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS