ప్ర‌భాస్‌తో పెళ్లి.. నిహారిక స్పంద‌న‌.

మరిన్ని వార్తలు

చిత్ర‌సీమ‌లో.. రూమ‌ర్ల‌కు కొద‌వ ఉండ‌దు. ఇదిగో పులి అంటే అదుగో తోక అనేవాళ్లు ఎక్కువ‌. ఇక్క‌డ తోక క‌నిపించక‌పోయినా - పులిని చూశామ‌నే వాళ్లే ఎక్కువ‌. హీరో హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో దూరి మ‌రీ... పుకార్లు సృష్టిస్తుంటారు. ఇలాంటి పుకార్ల‌కు బాగా అల‌వాటుప‌డిపోయిన పేరు... ప్ర‌భాస్‌. ప్ర‌భాస్ పెళ్లి - మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. చాలా కాలం క్రితం ఓ రాజ‌కీయ నాయ‌కుడి కుటుంబానికి చెందిన మ‌హిళ‌తో ప్ర‌భాస్‌కి సంబంధాలున్నాయ‌ని వార్త‌లొచ్చాయి. చూసీ చూసీ విసిగెత్తిన ప్ర‌భాస్ చివ‌రికి ఆ పుకార్ల‌ను తిప్పికొట్ట‌డం మొద‌లెట్టాడు. ఆ త‌ర‌వాత‌.. గాలి అనుష్క‌పై మ‌ళ్లింది.

 

ప్ర‌భాస్ - అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నార‌ని ఇప్పటికీ ఏదో ఓ చోట వార్త వ‌స్తూనే ఉంటుంది. ఇప్పుడు లేటెస్టుగా నిహారిక జాయిన్ అయ్యింది. ప్ర‌భాస్‌కీ నిహారిక‌కీ పెళ్లంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు గుప్పుమంటున్నాయి. వాటిపై ప్ర‌భాస్ ఇంకా స్పందించ‌లేదు. కానీ నిహారిక మాత్రం ఊరుకోలేదు. ఇదంతా అవాస్త‌వం అని తేల్చేసింది. ప్ర‌భాస్ తో పెళ్లి మాట‌రు గురించి ఓ అభిమాని ట్విట్ట‌ర్ లో నిహారిక‌ని ప్ర‌శ్నించాడు. దాంతో నిహారిక కూల్ గా స‌మాధానం ఇచ్చింది. ప్ర‌భాస్ తో పెళ్లి పుకారే అని తేల్చేసింది. నిహారిక నుంచే ఆ మాట వ‌చ్చింది కాబ‌ట్టి... ఇక ఈ పుకారుకి కూడా పుల్ స్టాప్ ప‌డిపోయిన‌ట్టే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS