నిహారిక పెళ్లి కుదిరిన సంగతీ, త్వరలోనే నిశ్చితార్థం జరగబోతున్న సంగతీ తెలిసినవే. అయితే పెళ్లయ్యాక నిహారిక సినిమాలకు దూరం అవుతుందా? చేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ నిహారిక మాత్రం సినిమాల్ని వదిలేలా లేదు. పెళ్లయ్యాక కూడా సినిమాల్ని కొనసాగించే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. తాజాగా ఓ తమిళ చిత్రంపై సంతకం చేసింది నిహారిక.
స్వాతి దర్శకురాలిగా పరిచయం అవుతోంది. 'ఓ మై కడవులే' తో ఆకట్టుకున్న అశోక్‌సెల్వన్ హీరోగా నటిస్తున్నాడు. జె.సెల్వకుమార్ నిర్మాత. ఇదో యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. నిహారికకు ఇది వరకు తమిళంలో నటించిన అనుభవం ఉంది. తెలుగులో హిట్స్ దక్కించుకోలేని ఈ మెగా డాటర్ తమిళంలో అయినా బోణీ కొడుతుందేమో చూడాలి.