సుశాంత్ ఆత్మ‌హ‌త్య వెనుక‌... ఆ ద‌ర్శ‌కుడు?

మరిన్ని వార్తలు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య ని బాలీవుడ్ మ‌ర్చిపోలేక‌పోతోంది. దానికి తోడు.. ఆత్మ‌హ‌త్య కి కార‌ణం ఎవ‌రు? అనే విష‌య‌మై ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. సుశాంత్ డిప్రెష‌న్ వ‌ల్లే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని ప్రాధ‌మిక నిర్దార‌ణ‌లో తేలింది. అయితే.. సుశాంత్ ఆత్మ‌హ‌త్య వెనుక ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌హేష్ భ‌ట్ ఉన్నాడ‌ని ఓ వార్త బాలీవుడ్ లో జోరుగా చ‌క్క‌ర్లు కొడుతోంది. రియా చక్రవర్తిని ప్రేమించిన సుశాంత్ ఆమెని పెళ్లి చేసుకోవాల‌నుకున్నాడు. అయితే కొంత‌కాలంగా రియా మ‌హేష్ భ‌ట్‌తో స‌న్నిహితంగా ఉంటుంద‌ట‌. వీరిద్ద‌రికీ సంబంధించిన కొన్ని ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

 

రియా ప్ర‌వ‌ర్త‌న సుశాంత్‌కి ఏమాత్రం న‌చ్చ‌లేద‌ని, అందుకే.. సుశాంత్ డిప్రెష‌న్ లోకి వెళ్లి ఉంటాడ‌న్న ఊహాగానాలు జోరందుకున్నాయి. మ‌రోవైపు ఇది ఆత్మ‌హ‌త్యేకాద‌ని ఇంకొంత‌మంది వాదిస్తున్నారు. సుశాంత్ మ‌ర‌ణించే ముందు రోజు స్నేహితుల‌తో క‌ల‌సి పార్టీ చేసుకున్నాడ‌ని, చాలా ఉల్లాసంగా క‌నిపించాడ‌ని, డిప్రెష‌న్ లో ఉన్న వ్య‌క్తి పార్టీ చేసుకోవ‌డం ఏమిటని? ప్ర‌శ్నిస్తున్నారు. సుశాంత్ ఉరి వేసుకున్న మాస్ట‌ర్ బెడ్ రూమ్ డూప్లికేట్ తాళాలు క‌నిపించ‌కుండా పోయాయ‌ని, ఉరి వేసుకున్న తాడుపై కూడా సుశాంత్ వేలి ముద్ర‌లు లేవ‌ని కొత్త వాద‌న తెర‌పైకి తీసుకొచ్చారు. ఇవ‌న్నీ పోలీసుల ద‌ర్యాప్తులో తేలాల్సిన విష‌యాలు. కాక‌పోతే... సుశాంత్ ఆత్మ‌హ‌త్య మిస్ట‌రీ ఇప్ప‌ట్లో తేలేలా క‌నిపించ‌డం లేదు. లోలోప‌ల చాలా నిజాలు దాగున్నాయ‌న్న సంగ‌తి అర్థ‌మ‌వుతూనే ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS