మెగా డాటర్ నిహారిక పెళ్లి కుదిరిందని, త్వరలోనే నిహారికని పెళ్లి కూతురిగా చూడబోతున్నామని ఓ వార్త గుప్పుమంది. దానికి తగ్గట్టుగానే ఇన్ స్ట్రాగ్రామ్లో ఓ ఫొటో పోస్ట్ చేసింది నిహారిక. ఓ అబ్బాయిని హగ్ చేసుకుంటూ... అమితానందంతో తీసుకున్న ఫొటో అది. అయితే ఆ అబ్బాయి మొహం మాత్రం కనిపించడం లేదు. అతనే.. నిహారిక కాబోయే భర్త అని తెలిసిపోతోంది. అతనెవరు? ఎలా ఉంటాడు? అన్న విషయాలు మాత్రం నిహారిక గోప్యంగా ఉంచింది.
శుక్రవారం వరుడి వివరాల్ని నిహారికే స్వయంగా ప్రకటించే అవకాశం ఉంది. నిశ్చితార్థానికి ముహూర్తం కూడా ఫిక్సయిపోయిందని, ప్రస్తుతం నాగబాబు కుటుంబం ఆ పనుల్లో నిమగ్నమై ఉందని సమాచారం అందుతోంది. వరుడు గుంటూరు వాసి అని సమాచారం. అది తప్ప... మరో క్లూ దొరడం లేదు. మరి నిహారిక ఏం చెబుతుందో?