మెగా కాంపౌండ్ నుంచి హీరోయిన్‌గా దూసుకొచ్చిన నిహారికకి ఇంకా టైవ్‌ు కలిసొచ్చినట్టు లేదు సినిమాల్లో. తెలుగులో చేసిన సినిమాలన్నీ నిరాశపర్చాయి. దాంతో తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది. సక్సెస్, ఫెయిల్యూర్ సంగతి పక్కన పెడితే, నిహారికలో చాలా ఈజ్ వుంది. ఆ విషయం ఆమె యాంకరింగ్ చూస్తే అర్థమవుతుంది. ఓ డాన్స్ షోకి యాంకర్‌గా వ్యవహరించి అప్పట్లో నిహారిక ఓ రేంజ్‌లో హల్‌చల్ చేసింది. ఇక, నిహారిక కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇవన్నీ ఓ ఎత్తు.. నిహారిక డాన్సింగ్ స్కిల్స్ ఇంకో ఎత్తు. నిన్న ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా నిహారిక ఓ ఆసక్తికరమైన వీడియో పోస్ట్ చేసింది. అదులో నిహారిక, డాన్స్ మాస్టర్ యశ్వంత్‌తో కలిసి అద్భుతమైన డాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చింది.
ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. సరైన ఛాన్స్ దొరికితే తన డాన్సింగ్ టాలెంట్ ఏంటో చూపిస్తానంటోన్న నిహారిక, త్వరలోనే తన కోరిక నెరవేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది. గ్లామరస్ రోల్స్‌లో కూడా కన్పించబోతున్నానంటూ ఈ మధ్యనే నిహారిక ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం విదితమే. త్వరలో తెలుగులోనూ ఓ సినిమా చేయబోతోంది ఈ మెగా ప్రిన్సెస్. ఆ వివరాలు అతి త్వరలోనే వెల్లడవుతాయి.