విజయ్ దేవరకొండకి ‘రౌడీ హీరో’ అనే గుర్తింపు వచ్చింది ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతోనే. ఆ సినిమానే అతన్ని రాత్రికి రాత్రి స్టార్‌గా మార్చేసింది. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత విజయ్ దేవరకొండతో దర్శకుడు సందీప్‌రెడ్డి మరో సినిమా తీస్తాడనే ప్రచారం జరిగినా, అదిప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు. అందుకు బలమైన కారణం కూడా లేకపోలేదు. సందీప్, ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత బాలీవుడ్‌కి వెళ్ళాడు. అక్కడే ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్‌సింగ్’ని తెరకెక్కించాడు. ఆ తర్వాత అతనికి బాలీవుడ్ నుంచి ఆఫర్స్ బాగానే వస్తున్నాయి.
ఇదిలా వుంటే, తాజాగా ‘ది దేవరకొండ ఫౌండేషన్’ని స్థాపించిన ‘మిడిల్ క్లాస్ ఫండ్’ ఏర్పాటు చేసి, కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదల్ని ఆదుకునేందుకు విజయ్ దేవరకొండ ముందుకు రావడాన్ని అభినందించాడు సందీప్ రెడ్డి వంగా తనదైన స్టయిల్లో. సందీప్ ట్వీట్‌కి బదులిస్తూ, లాక్‌డౌన్ పీరియడ్‌లో రెండు మూడు కథలు రెడీ చేయాలనీ, రెండేళ్ళు వేచిచూసే ఓపిక తనకు లేదనీ విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించాడు. అంటే, అతి త్వరలో ‘అర్జున్‌రెడ్డి’ కాంబోని మళ్ళీ చూడబోతున్నామన్నమాట. ఇదిలా వుంటే, విజయ్ ప్రస్తుతం ‘ఫైటర్’ సినిమా చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న విషయం విదితమే.