ముద్దుగుమ్మ నికీషా పటేల్‌కి అందం, అభినయంతో పాటు అణువణువునా కిక్కెక్కించే హాట్నెస్.. అన్నీ ఉన్పప్పటికీ హీరోయిన్గా అవకాశాలే కరువయ్యాయి. పవర్ స్టార్‌తో 'పులి' సినిమాలో నటించి, తన గ్లామర్‌తో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. అయినప్పటికీ ఆ తర్వాత కూడా చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు ఈ ముద్దుగుమ్మకి. అయితేనేం ఏమాత్రం డిజప్పాయింట్ అవ్వకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బికినీ సొగసులతో రెచ్చిపోతోంది. మొన్నీమధ్యనే బికినీలో ఫొటోసెషన్ చేయించుకుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా బికినీలతో హల్చల్ చేస్తోంది. వాట్ ఏ బ్యూటీ అనదగ్గ అందం ఆమెలో ఉన్నా, ఫిజిక్ మీద ఎక్కువ దృష్టిపెట్టదు. కొంచెం నాజూగ్గా మారితే అవకాశాలు వెల్లువలా వచ్చిపడే అవకాశముంది. ఆ మాటే ఆమె దగ్గర ప్రస్థావిస్తే, తన శరీరం కాస్త బొద్దుగా ఉంటుందని సింపుల్‌గా సరిపెట్టేసుకుంటోంది ఈ బ్యూటీ. బొద్దుగా ఉన్నా అందమే కావొచ్చుగానీ, ఆ బొద్దుతనం ఎక్కువైపోతేనే కష్టం. అదే ఆమెకు పెద్ద సమస్యగా మారింది. అయితే ఇప్పుడు బికినీ కోసం కాస్త సన్నబడిందిలెండి. అందుకూ ఈ నాజూకు శరీరంతో బికినీలో నేనెలా ఉన్నానంటూ చెక్ చేసుకుంటుందో ఏమో, డిఫరెంట్ బికినీల్లో సెల్ఫీల మీద సెల్ఫీలు దిగి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తోంది. అయితే ఈ బ్యూటీ ఇదే ఫిజిక్‌ని మెయిన్‌టెయిన్ చేస్తే మంచిదే. ఇంతలా బికినీ హొయలొలికిస్తున్న ఈ బ్యూటీకి ఇకపై అయినా తగిన అవకాశాలు వస్తాయా? చూడాలిక.