నికీషా హాటెస్ట్‌ బికినీ సెల్ఫీ

By iQlikMovies - October 04, 2018 - 15:43 PM IST

మరిన్ని వార్తలు

తొలి సినిమానే పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌తో చేసే ఛాన్స్‌ వచ్చినా, ఈ బ్యూటీకి లక్కు కలిసి రాలేదు టాలీవుడ్‌లో. అప్పటినుంచీ సక్సెస్‌ కోసం ప్రయత్నిస్తూనే వుంది. తెలుగులో కొన్ని సినిమాలు చేసిన ఈ బ్యూటీకి అవేవీ సక్సెస్‌లు ఇవ్వకపోవడంతో డీలాపడిపోయింది. ప్రస్తుతం తెలుగులో 'గుంటూరు టాకీస్‌' సీక్వెల్‌లో నటిస్తోన్న ఈ బ్యూటీ, సోషల్‌ మీడియాలో మాత్రం చాలా హాట్‌గా, చాలా యాక్టివ్‌గా కన్పిస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు హాటెస్ట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడం ఈ ముద్దుగుమ్మకి ఓ హాబీగా మారిపోయింది. నాటీయెస్ట్‌ కామెంట్స్‌ని కూడా ఈ బ్యూటీ తెగ ఎంజాయ్‌ చేసేస్తున్నట్లే కన్పిస్తోంది. అభిమానుల కోసం అస్సలేమాత్రం మొహమాటపడకుండా.. ఇదిగో, ఇలాంటి బికినీ సెల్ఫీలతో కిర్రాకు పుట్టించేస్తోంది నికీషా పటేల్‌. ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్‌.. సరైన ఛాన్స్‌ దొరికితే తన సత్తా ఏంటో చాటి చెబుతానంటోన్న ఈ బ్యూటీ, వెండితెరపై సత్తా చాటడం మాటేమోగానీ.. సోషల్‌ మీడియాలో మాత్రం, ఓ రేంజ్‌లో తన గ్లామర్‌ సత్తాని చూపించేస్తోంది. ఇలాంటి ఫొటోలకి యూత్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయిపోకుండా వుంటారా.? అదే ఆమెక్కావాల్సింది కూడా.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS