బండ్ల గణేష్‌ 100 కోట్ల 'మెగా' సినిమా

మరిన్ని వార్తలు

ఒకప్పుడు కమెడియన్‌గా పలు సినిమాల్లో నటించిన బండ్ల గణేష్‌, అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతల్లో ఒకడిగా ఎదిగాడు. భారీ చిత్రాలు నిర్మించి, భారీ విజయాలు అందుకున్న ఈ నిర్మాత, ఈ మధ్య కొంచెం గ్యాప్‌ తీసుకున్నాడు. 

రాజకీయాలపై ఫోకస్‌ పెట్టిన బండ్ల గణేష్‌, కాంగ్రెస్‌ పార్టీ నుంచి తెలంగాణలో జరిగే ముందస్తు ఎన్నికల్లో పోటీ చేయబోతున్న సంగతి తెల్సిందే. సినిమాల్లో కోట్లు ఖర్చుపెట్టడానికి వెనుకాడని ఈ నిర్మాత, రాజకీయాల్లో మాత్రం ఆ స్థాయిలో ఖర్చు చెయ్యబోడట. టిక్కెట్‌ వస్తే, నిబంధనల ప్రకారం 30 లక్షల లోపే ఖర్చు చేస్తానని చెప్పాడు. సినిమాల విషయానికొస్తే, 100 కోట్లు పెట్టి సినిమా తీసే సత్తా తనకు ఇంకా వుందని అంటున్నాడు. ఇదిలా వుంటే, త్వరలోనే బండ్ల గణేష్‌ ఓ భారీ సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నాడట. 

ఎన్నికల ప్రసహనం పూర్తయ్యాక, వీలైనంత త్వరగా సినిమాని సెట్స్‌ మీదకు తీసుకెళ్ళాలనే ఆలోచనలో బండ్ల గణేష్‌ వున్నట్లు సమాచారం. మెగా కాంపౌండ్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలున్నప్పటికీ ఇతర హీరోలతోనూ సినిమాలు చేశాడు గనుక.. బండ్ల గణేష్‌ ఎవరితో అంత భారీ సినిమా తీయబోతున్నాడనే ఉత్కంఠ తలెత్తడం సహజమే. అయితే ఓ మెగా సినిమా తీయబోతున్నాడనీ, మెగా కాంపౌండ్‌ నుంచే ఓ బిగ్‌ హీరోతో బండ్ల గణేష్‌ ఇప్పటికే సంప్రదింపులు జరిపి సినిమాని ఓకే చేశాడనీ తెలుస్తోంది. 

100 కోట్ల బడ్జెట్‌తో బండ్ల గణేష్‌ తెరకెక్కించనున్న ఈ బిగ్‌ మూవీ కోసం, ఓ ప్రముఖ దర్శకుడు కథ రెడీ చేశాడట. త్వరలో ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS