మిలమిల మెరిసే దేహం.. ఆ దేహాన్ని కవర్ చేసీ చెయ్యనట్టుండే బికినీ.. ఆపై అందాల ఆడపులి.. ఇకనేం, కుర్రకారు గుండెలు బద్ధలైపోవాలంతే అన్నట్టుంది కదూ ఈ బికినీ బ్యూటీ. 'కొమరం పులి' సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నికీషా పటేల్, తొలి సినిమాతోనే పవన్‌కళ్యాణ్ సరసన ఛాన్స్ కొట్టేసిందిగానీ, ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టేయడంతో.. మళ్ళీ అంతటి పెద్ద అవకాశాలు ఆమెకు రాలేదు. చిన్నా చితకా అవకాశాలు రావడం, ఆ సినిమాలూ ఫ్లాపయ్యేసరిక, అంతా ఈ బ్యూటీని లైట్ తీసుకున్నారు. అందానికి అందం, నటనకు నటన.. అన్నీ వున్నా, సక్సెస్ లేకపోతే కష్టమే కదా? అదే నికీషా పటేల్ ఆవేదన కూడా. ప్రస్తుతం తెలుగులో 'గుంటూరు టాకీస్ -2' సినిమాలో నటిస్తోన్న నికీషా, కన్నడ, తమిళ సినిమాల్లోనూ నటిస్తున్నానని చెబుతోంది. సినిమాల్ని పక్కన పెడితే సోషల్ మీడియాలో తన బికినీ సెల్ఫీలతో కుర్రకారుకి గాలమేస్తూ, ఫాలోవర్స్‌ని పెంచుకుంటూ పోతోంది ఈ ఆడపులి.