బాబు గారి బ‌యోపిక్... ఇక రాదా?!

By iQlikMovies - October 08, 2018 - 11:18 AM IST

మరిన్ని వార్తలు

ఓవైపు `ఎన్టీఆర్‌` బ‌యోపిక్ న‌డుస్తుంటే... మ‌రోవైపు చంద్ర‌బాబు నాయుడు జీవిత క‌థ‌నీ బ‌యోపిక్‌గా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టేశారు. దానికి 'చంద్రోద‌యం' అని పేరు కూడా పెట్టారు.  ఆమ‌ధ్య ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసి హ‌డావుడి చేశారు. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. 

అయితే.. ఇప్పుడు ఈ చంద్రోద‌యం ఆగిపోయిన‌ట్టు టాక్‌.  ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ మ‌రీ ఫ‌న్నీగా ఉండడం, దాన్ని నెటిజ‌న్లు వీర లెవిల్లో ట్రోల్ చేయ‌డం.. ఇవ‌న్నీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం వ‌ర‌కూ చేరాయ‌ని స‌మాచారం.  ఓ రాష్ట్ర ముఖ్య‌మంత్రి జీవిత క‌థ‌ని ఇంత ఆషామాషీగా తెర‌కెక్కిస్తారా?  అంటూ చిత్ర‌బృందంపై టీడీపీ నేత‌లు కొంత‌మంది ఫైర్ అయ్యార‌ని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లార్ట‌. దాంతో ఈ బ‌యోపిక్ ఆడిపోయింద‌ని తెలుస్తోంది. 

ఈ క‌థ‌ని మ‌రొక‌రికి అప్ప‌గిస్తారా?  లేదంటే రీ షూట్లు చేసి ఈసారి క్వాలిటీ విష‌యంలో కేర్ తీసుకుంటారా?  అనేది తెలియాల్సివుంది. ఈ బ‌యోపిక్ ఇక రాద‌ని టాలీవుడ్‌లోనూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS