చేతిలో సినిమాల సంగతెలా వున్నా, సోషల్ మీడియాలో బికినీ పోజులతో కిర్రాకు పుట్టించడంలో మాత్రం నికీషా పటేల్ తర్వాతే ఎవరైనా. తెలుగులోకి ఎంట్రీ ఇస్తూనే పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌తో ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ, ఆ తర్వాత తెలుగులో సరైన అవకాశాల్ని దక్కించుకోలేకపోయింది. వచ్చిన అరకొర అవకాశాలూ ఆమెకు ఫ్లాపుల్నే మిగిల్చాయి. ఒక్కటంటే ఒక్క హిట్టు లేదు నికీషా పటేల్‌కి తెలుగులో. తాజాగా ఈ బ్యూటీ 'గుంటూరు టాకీస్' సీక్వెల్ నటిస్తోంది.
కన్నడ, తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లోనూ ఈమె ప్రయత్నాలైతే కొనసాగుతున్నాయి. సినిమాలు, ఛాన్సుల సంగతి పక్కన పెడితే, నికీషా సిరీస్ ఆఫ్ బికినీ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడం ట్రెండింగ్‌గా మారుతోంది. వెకేషన్ మూడ్‌లో తన అభిమానుల్నీ ముంచేయాలనుకుంటోన్న ఈ బ్యూటీ, కళ్ళతోనే హాట్ హాట్‌గా కత్తులు దూసేస్తోంటే, కుర్రకారు ఎలా తట్టుకోగలరు?