హా హా హా నికీషా గ్లామర్‌ హమేషా.!

By iQlikMovies - August 03, 2018 - 18:01 PM IST

మరిన్ని వార్తలు

నికీషా పటేల్‌ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హాట్‌నెస్‌కి కేరాఫ్‌ ఆడ్రస్‌ ఈ పేరు. ఈ మధ్య సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ బికినీలతో సెగ రేపేసిందీ ముద్దుగుమ్మ. పవన్‌ కళ్యాణ్‌తో 'కొమరం పులి' చిత్రంలో నటించిన ఈ హాట్‌బ్యూటీ అవకాశాల కోసం ఎదురు చూసి, చూసి సంధించిన గ్లామర్‌ ఆస్త్రాలు అన్నీ ఇన్నీ కావు. మొత్తానికి ఇప్పుడిప్పుడే అమ్మడు బిజీ అవుతోంది. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీ కాగా, మరోటి 'గుంటూర్‌ టాకీస్‌ 2'. గతంలో హాటెస్ట్‌ యాంకర్‌ రేష్మీ హీరోయిన్‌గా నటించిన 'గుంటూర్‌ టాకీస్‌' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రమే ఇది. కాగా ఈ అవకాశాల జోరులో ఉబ్బి తబ్బిబ్బవుతున్న నికీషా పటేల్‌, సోషల్‌ మీడియాలో హాట్‌ పిక్స్‌ ద్వారా అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంటోంది. అందులో భాగంగానే ఈ పిక్‌ చూశారుగా. అమ్మడి నాభి సౌందర్యం కెవ్వుకేక పుట్టించేస్తోంది. ఈ హాట్‌ సెల్ఫీకి ఎలాంటి వారైనా కిల్‌ అయిపోవాల్సిందేగా మరి.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS