శ్రీరెడ్డి గురించి పవన్‌ ఏమన్నాడంటే.!

By iQlikMovies - August 03, 2018 - 17:17 PM IST

మరిన్ని వార్తలు

ఈ మధ్య టాలీవుడ్‌కి సంబంధించిన సినీ ప్రముఖులపై నటి శ్రీరెడ్డి చేసిన రచ్చ రంభోలా సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆమె ఆరోపణలకు కొందరు స్పందించారు. కొందరు లైట్‌ తీసుకున్నారు. మరి కొందరు కేసులు కూడా పెట్టారు. ఆ తర్వాత ఆమెనే లైట్‌ తీసుకున్నారు. 

ఇకపోతే తాజాగా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఏదో సిట్యువేషనల్‌గా శ్రీరెడ్డి తలపు తీసుకొచ్చారు. ఈ మధ్య ఒకమ్మాయి నన్ను తిట్టింది. తిరిగి తిట్టాలంటే నేను కూడా అంతకన్నా ఎక్కువే తిట్టగలను. కానీ నేను మా అమ్మ దగ్గర పెరిగాను. వదిన దగ్గర పెరిగాను. ఆడవాళ్ల విలువ ఏంటో నాకు తెలుసు. మహిళలంటే గౌరవం ఉంది. తిట్టిన వార్ని తిరిగి తిట్టలేకపోవడం చేతకానితనం కాదు..' అని ఇన్‌డైరెక్ట్‌గా శ్రీరెడ్డిని గురించి పవన్‌ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 

ఇంతకీ ఈ వీడియోని పోస్ట్‌ చేసింది ఎవరో తెలుసా? బుల్లితెర హాటెస్ట్‌ యాంకర్‌ అనసూయ. ఆమె తన ట్విట్టర్‌లో ఈ వీడియో పోస్ట్‌ చేసింది. ఇప్పుడీ వీడియో వైరల్‌ అయ్యింది. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు దూరంగా ఉంటూ, 'జనసేన' పార్గీ తరపున రాజకీయాల్లో తిరుగుతున్నారు. 

2019 ఎలక్షన్స్‌లో జనసేన పార్టీ అధ్యక్షుడిగా వామ పక్షాలతో కలిసి పోటీ చేసే యోచనలో పవన్‌ కళ్యాణ్‌ ఉన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS