బికినీలతో కాక రేపిన ముద్దుగుమ్మ నికీషా పటేల్ ఇప్పుడు తమిళంలో ఫుల్ బిజీగా గడుపుతోంది. వరుసగా బికినీలతో టాపు లేపిన అమ్మడు తమిళ తంబీల్ని బాగా ఇంప్రెస్ చేసింది. దాంతో వరుస అవకాశాలతో తెగ బిజీ అయిపోయింది. ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు ఒకేసారి పోటెత్తాయి నికీషా పటేల్‌కి. దాంతో క్షణం తీరిక లేకుండా స్కిన్ షోకి సమయమే లేకుండా పోయింది అమ్మడికి. తాజాగా ఓ తమిళ సినిమా ప్రమోషన్స్‌లో ఇదిగో ఇలా తళుక్కున మెరిసింది. ఛమక్, ఛమక్ మోడ్రన్ కాస్ట్యూమ్ ధరించింది.
శారీలా డిజైన్ చేసిన ఈ కాస్ట్యూమ్‌కి చెమ్మీ హాట్ బ్లౌజే స్పెషల్ అట్రాక్షన్. గోల్డెన్ ప్యాటర్న్‌లో డిజైన్ చేసిన ఈ చెమ్కీ బ్లౌజ్‌కి మ్యాచింగ్ నెయిల్ పాలిష్ వేసింది. నడుముకి గోల్డెన్ బెల్ట్ ఆమె ఫిగర్‌ని పర్ఫెక్ట్గా ఎలివేట్ చేస్తోంది. మధ్య పాపిటతో సాఫ్ట్‌గా హెయిర్‌ని దువ్వి వదిలేసింది. నెట్టింట్లో నికీషా ఫాలోవర్స్ ఈ పిక్కి ట్రెమండస్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తెలుగులో 'పులి' సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు 'గుంటూర్ టాకీస్ 2' సినిమాలో నటిస్తోంది.