ఇంకెవరితో...ఆయన నటించిన తొలి సినిమా హీరోయిన్ పూజా హెగ్దే కావచ్చు లేదంటే, 'కంచె'లో ప్రగ్యా జైశ్వాల్‌తో కావచ్చు లేదంటే మూడో సినిమా 'లోఫర్'లో దిశా పటానీతో కావచ్చు అని ఈజీగా చెప్పేస్తారేమో. అబ్బా.. ఆశ, దోశ, అప్పడం.. రీల్ లైఫ్ కాదండీ బాబూ. రియల్ లైఫ్ కిస్ అండీ బాబూ. రియల్ లైఫా.? మాకేం తెలుస్తుంది అనుకుని నిరాశ పడకండి. ఆ రియల్ లైఫ్ పర్సనల్ ముచ్చట్లు తెలుసుకునేందుకే మంచు వారమ్మాయి లక్ష్మీ ప్రసన్న 'ఫీట్ అప్ విత్ స్టార్స్' అంటూ ఓ ప్రోగ్రాం ప్లాన్ చేసింది కదా.
ఆ ప్రోగ్రామ్‌లో మన వరుణ్ బాబు రియల్ లైఫ్ కిస్సింగ్, హగ్గింగ్ విషయాల్ని కూపీ లాగేసింది. అందులో భాగంగా, ఫస్ట్ కిస్ ఎవరితో అని అడిగితే, అబ్బో టెన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడే ఫస్ట్ కిస్ ఇచ్చేశానని చెప్పేశాడీ రొమాంటిక్ మెగా హీరో. ఆ తర్వాత ఇంకోసారి ఫ్రెండ్స్‌తో క్లబ్‌కి వెళ్లినప్పుడు వెనక నుండి ఓ అమ్మాయి వచ్చి వరుణ్‌ని హగ్ చేసుకుందట. ఆ తర్వాత ఓ స్వీట్ కిస్ కూడా లాగించేసిందట. భలే ఇంట్రెస్టింగ్ కదా. ఇక రీల్ లైఫ్ కిసెస్ మాటకొస్తే, 'లోఫర్'లో దిశా పటానీతో కలిసి ఓ సాంగ్‌లో వరుణ్ తేజ్ రొమాన్స్ వావ్ అనిపిస్తుంది.
ఇలాంటివి ఆన్‌స్క్రీన్ చాలానే ఉన్నాయనుకోండి. అయితే, ఆఫ్ స్క్రీన్ మాత్రం ఫస్ట్ రొమాంటిక్ ఫీలింగ్స్ పైన చెప్పినవేనట. నమ్మాలి మరి. ఇకపోతే లేటెస్ట్‌గా ఈ రొమాంటిక్ బోయ్ 'గద్దలకొండ గణేష్'తో ఎలా గత్తరలేపాడో చూస్తున్నాం కదా. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్నాడు మన గద్దల కొండ గణేష్. 'ఎల్లువొచ్చి గోదారమ్మ..' సాంగ్‌లో పూజా హెగ్దేతో చేసిన రొమాంటిక్ డాన్స్ ఫీట్స్ అదరగొట్టేశాడంతే.