ముద్దుగా బొద్దుగా కనిపించే నికీషా పటేల్ అదేంటీ ఇలా అయిపోయిందే అనుకుంటున్నారా.? ఇదే జీరోసైజ్. తెలసిందే కదా. ఒకింత అవకాశాలకు దూరమైన ముద్దుగుమ్మలు వెంటనే ఫాలో చేసేది ఈ ఫార్ములానే. అదే నికీషా పటేల్ కూడా ఫాలో చేసినట్లుంది. చూస్తున్నారుగా ఎంత స్లిమ్‌గా మారిపోయిందో. మొన్నా మధ్య బికినీ ఫోటోలతో రెచ్చిపోయి పోజులిచ్చిన ఈ బ్యూటీ ఎట్టకేలకు కొన్ని అవకాశాలు దక్కించుకుంది.
అయితే, దొరికిన ఆ అవకాశాల స్టేటస్ ఏంటో తెలీదు కానీ, జస్ట్ ఏ స్మాల్ బ్రేక్ తర్వాత ఇదిగో మళ్లీ సోషల్ మీడియాలో ఇలా దర్శనమిచ్చింది. అయితే, బొద్దుగా ఉన్నప్పుడే సాలిడ్ గ్లామర్‌తో ఆకట్టుకున్నావ్ అంటూ ఈ ఫోటోలకు కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరైతే, ఏం చేశావో నాక్కూడా చెప్పవా.. ఇంత సన్నగా ఎలా మారావో.. అంటూ సలహాలు అడిగేస్తున్నారు. వైట్ టాప్, అండ్ మస్టర్డ్ స్కర్ట్‌లో క్యాజువల్‌గా పోజిచ్చిన నికీషాలో సమ్‌థింగ్ తెలియని కళ కనబడుతోంది. బహుశా అమ్మడు బాలీవుడ్కేమైనా ట్రై చేస్తోందో ఏమో కానీ, లుక్స్ చూస్తే అలానే అనిపిస్తున్నాయి.