పెళ్లి తర్వాత సమంతకు ఛాన్సెస్ తగ్గిపోయాయట. అదేంటీ అని ఆశ్చర్యపోతున్నారా.? మరి ఆశ్చర్యం కలిగించే విషయమే ఇది. కానీ, ఈ మాట చెప్పింది మరెవరో అయితే, అలాగే ఆశ్చర్యపోవాలి కానీ, ఈ మాట అన్నది స్వయంగా సమంతే. ఇప్పుడింకా సర్‌ప్రైజ్ అయ్యారు కదా. అవును మరి టాలీవుడ్‌లో ఇప్పుడు బిజీయెస్ట్ హీరోయిన్స్‌లో సమంత పేరు మొదటి వరసలోనే ఉంటుంది. పెళ్లి తర్వాత కూడా ఓ హీరోయిన్ ఇంత బిజీగా ఉంటుందా.? అంటే సమంతని చూసి అవుననే అనాలి ఖచ్చితంగా. అయితే, సమంత యాంగిల్ నుండి ఆలోచించి చూస్తే, సమంత స్టేట్‌మెంట్ నిజమే అనిపిస్తోంది. పెళ్లి తర్వాత సమంతకు ఎలాంటి రోల్స్ ఇవ్వాలో దర్శక, నిర్మాతలకు తెలియడం లేదట. దాంతో ఇంట్రెస్టింట్ కాన్సెప్ట్‌లతోనే సరిపెడుతున్నారట సమంతకు. అంటే గ్లామర్ రోల్స్‌లో సమంతను ఊహించుకోవడానికి దర్శక, నిర్మాతలు కాస్త ఇబ్బంది పడుతున్నారట.. అదీ సంగతి. అందుకే సమంత ఇలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చింది.
ఏది ఏమైనా సమంత నుండి ఇది ఒకింత ఇంట్రెస్టింగ్ స్టేట్‌మెంటే అనాలి మరి. ప్రస్తుతం సమంత 'ఓ బేబీ' సినిమాలో నటిస్తోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. జూలై 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి రీమేక్‌గా రూపొందుతోంది. మరోవైపు సమంత 'మన్మధుడు 2'లో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, సమంత మరోసారి తన రియల్ లైఫ్ భర్త చైతూతో కలిసి నటించబోతోందట. 'మజిలీ' హిట్‌తో ఈ కాంబినేషన్‌లో ఇంకో సినిమాకి ప్లాన్ చేస్తున్నారట. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాని రూపొందించే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది.