'దిశ' ఘటన నిందితుల ఎన్‌కౌంటర్‌పై సెలబ్రిటీలు తమదైన స్టయిల్లో స్పందిస్తూనే వున్నారు. వైద్యురాలిపై పాశవికంగా అత్యాచారం చేసిన నలుగురు నిందితులు, అనంతరం ఆమెను కిరాతకంగా హత్య చేసిన ఘటన దేశాన్ని కుదిపేసింది. ఎట్టకేలకు ఈ ఘటనలో దోషులకు 'ఎన్‌కౌంటర్' శిక్ష పడటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తాజాగా నికీషా పటేల్ ఈ ఘటనపై స్పందించింది. 8వ వండర్‌గా ఎన్‌కౌంటర్‌ని అభివర్ణించింది నికీషా పటేల్. ప్రతి అత్యాచార ఘటనలోనూ దోషులకు ఎన్‌కౌంటర్ అనేది శిక్షగా వుండాలని ఆమె కోరుతోంది.
హైద్రాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది నిఖీషా పటేల్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'కొమరం పులి' సినిమాతో నిఖీషా పటేల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం విదితమే. అయితే, తొలి సినిమా పరాజయం పాలవడంతో ఆమె తెలుగునాట నిలదొక్కుకోలేకపోయింది. కళ్యాణ్‌రామ్‌తో 'ఓం' వంటి సినిమాల్లో నటించిన నికీషా ప్రస్తుతం కొన్ని తమిళ సినిమాలతో బిజీగా వుంది. దాదాపు అరడజను సినిమాలు 2020లో విడుదల కానున్నాయి నికీషా పటేల్ నుంచి. తెలుగులోనూ ఒకట్రెండు సినిమాల్లో ఆమె నటించబోతోందట. కాగా, దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై భిన్న స్వరాలు ఊపందుకుంటున్నాయి.