నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా నిన్ననే పట్టాలెక్కింది. `నువ్వు మాట్లాడితే అది శబ్దం - అదే మాట నా నోటి నుంచి వస్తే అది శాసనం` అంటూ బాలయ్య తొలి డైలాగ్ పలికాడు. యాక్షన్‌కి పెద్ద పీట వేసిన ఈ కథలో ఎమోషన్స్‌కీ స్థానం ఇచ్చారట. బాలయ్య పాత్ర శక్తిమంతంగా ఉంటుందని బోయపాటి శ్రీను చెబుతున్నాడు. అయితే కథానాయిక ఎవరన్నది ఇంత వరకూ తేలలేదు. ఓపెనింగ్ రోజున కూడా హీరోయిన్‌ని ప్రకటించలేదు.
అయితే ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్ నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ విషయమై కీర్తి సురేష్‌నిచిత్రబృందం సంప్రదిస్తోందని సమాచారం. అయితే కీర్తి ప్రస్తుతం బిజీ బిజీగా ఉంది. ఈ సినిమా కోసం కాల్షీట్లు కేటాయించే పరిస్థితుల్లో ఉందా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదు. అవన్నీ ఓ కొలిక్కి వచ్చాన తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పిందట. అన్నట్టు ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలయ్య చిత్రానికి తమన్ సంగీతం అందించడం ఇదే తొలిసారి.