తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా పాపం 'ఐరన్ లెగ్' ఇమేజ్ మాత్రం పోవడంలేదు 'కొమరం పులి' ఫేం నికీషా పటేల్‌కి. తొలి సినిమాతోనే పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సరసన ఛాన్స్ కొట్టేయడమంటే, ఆ తర్వాత ఆమెకు అవకాశాలు పోటెత్తెయ్యాలి. కానీ ఎందుకో ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అందుక్కారణం, ఫిజిక్ విషయంలో నికీషా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమేననే విమర్శలున్నాయి.
అదొక్కటే కాదు, ఆమె చెప్పే రెమ్యునరేషన్, ఆమె కోరే గొంతెమ్మ కోర్కెలు వంటివన్నీ నికీషా కెరీర్‌కి ప్రతిబంధకంగా మారాయంటారు కొందరు. అయితే అవన్నీ జస్ట్ రూమర్స్ అని కొట్టి పారేయడం నికీషా పటేల్‌కి అలవాటే. హీరోయిన్‌గా తెరమరుగైపోయినట్లేనని అంతా అనుకున్న టైమ్‌లో ఓ ఛాన్స్ నికీషా తలుపు తట్టింది. పైగా ఇది ఓ యాక్షన్ సినిమా. అవకాశాల కోసం నికీషా ఇప్పటిదాకా చెయ్యాల్సినవన్నీ చేసేసింది. ఇప్పుడీ యాక్షన్ ఒక్కటీ మిగిలిపోయినట్టుంది. ఈసారేం చేస్తుందోగానీ, ఈ సినిమా కోసం నికీషా బాగా సన్నబడిన మాట వాస్తవం.
టూ పీస్ బికినీలో ఇటీవలే ఫొటోలకు పోజులిస్తూ సోషల్ మీడియాని హీటెక్కించేసింది. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుని మరీ, 'రౌడీ పోలీస్' సినిమాలో నటిస్తోన్న నికీషా, లేడీ యాక్షన్ డైనమైట్ అనిపించుకోవాలని తహతహలాడుతోన్న నికీషా, ఈ సినిమాలో కూడా బికినీ గ్లామర్‌తో కిర్రాకు పుట్టించబోతోందట. ఇటు గ్లామర్‌కీ అటు యాక్షన్‌కీ స్కోప్ ఉన్న ఈ సినిమాని ఓ కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీగా అభివర్ణిస్తోంది నికీషా పటేల్.
మళ్ళీ ఇంకోసారి పవన్ సరసన నటించాలని ఉందని అంటోన్న ఈ బ్యూటీ, ఇకపై బొద్దుగా మారే ప్రసక్తే లేదని ఫిజిక్ విషయంలో అప్రమత్తంగా ఉంటానని హామీ ఇస్తోంది.